Thalapathy Vijay : సెకండ్ ప్లేస్‌లో దళపతి సీఎం విజయ్ - IMDb లిస్ట్‌లో టాప్ ఇండియన్ సెలబ్రిటీగా రికార్డ్
CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచారు. IMDb లేటెస్ట్ లిస్ట్ తాజాగా రిలీజ్ చేయగా... గత వారం 21వ స్థానంలో ఉన్న విజయ్ ప్రస్తుతం టాప్‌లో కంటిన్యూ అవుతున్నారు.

Tamilnadu CM Vijay Is In Top Place At Imdb Celebrities List : కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ టాప్ ట్రెండింగ్‌లో కంటిన్యూ అవుతున్నారు. అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్‌లోనూ ఆయన పేరు మార్మోగుతోంది. రీసెంట్‌గా తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయంతో రికార్డు సృష్టించారు. మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌లో విజయ్ రెండో స్థానం సంపాదించుకున్నారు.
టాప్ సెకండ్ ప్లేస్‌లో...
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ IMDb తాజాగా పాపులర్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేయగా అందులో సెకండ్ ప్లేస్‌లో విజయ్ నిలిచారు. అంతకు ముందు వారం ఆయన 21వ స్థానంలో ఉండగా... ఇప్పుడు రెండో స్థానం కైవసం చేసుకున్నారు. వరల్డ్ వైడ్‌గా ఉన్న 250 మిలియన్లకు పైగా వచ్చిన ఆడియన్స్ వ్యూస్ ఆధారంగా ఈ లిస్ట్ రెడీ చేసినట్లు సదరు సంస్థ వెల్లడించింది.
ఇక టాప్ ప్లేస్‌లో నటుడు, దర్శకుడు అంబరీష్ వర్మ ఉన్నారు. రీసెంట్‌గా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'సప్నే Vs ఎవ్రీవన్ సీజన్ 2' వెబ్ సిరీస్ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతోంది. దీంతో ఆయన టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఇక హీరోయిన్ సాయి పల్లవి ఏడో స్థానం దక్కించుకున్నారు. రీసెంట్‌గా ఆమె బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'ఏక్ దిన్' ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించారు.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు























