Radhika New Look Form Thaai Kizhavi Movie : మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచీ టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో నటించి మెప్పించారు సీనియర్ నటి రాధికా శరత్ కుమార్. తెలుగు, తమిళ మూవీస్‌లో హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో డిఫరెంట్ లుక్‌తో తమిళ మూవీ 'తాయి కిళవి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదివరకు ఎన్నడూ చూడని రోల్‌లో లుక్స్‌తోనే భయపెట్టేశారు.
గ్రామీణ వృద్ధురాలిగా...
ఈ మూవీకి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తుండగా... తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మించారు. రాధికా శరత్ కుమార్‌తో పాటు అరుళ్ దాస్, బాల శరవణన్, సింగమ్ పులి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో గ్రామీణ వృద్ధురాలి పాత్రలో ఇదివరకు ఎన్నడూ చూడని లుక్‌లో రాధికా కనిపించనున్నారు.
'తాయి కిళవి' మూవీలో ఊరిలో రుణాలిచ్చే వృద్ధురాలు 'పసుపు తాయి'గా రాధికా సరికొత్త అవతారం ఎత్తారు. 'పసుపుతాయి' కలెక్షన్స్ కోసం వస్తుంది పరుగెత్తండిరోయ్... అంటూ ఊరంతా టెన్షన్‌తో పరుగులు తీయడం టీజర్‌లో చూపించగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తెలుగులో వస్తుందా?
'తాయి కిళవి' తెలుగు రీమేక్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది. ఒకప్పటి జనరేషన్‌కు ఫేవరెట్ హీరోయిన్ అయిన రాధికా ఇప్పుడు 'పసుపుతాయి'గా డిఫరెంట్ లుక్‌తో అందరినీ ఆకర్షిస్తుండగా... తెలుగులో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు. మరి మూవీ టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read : ఆ ఛానల్‌లో రోషన్ 'ఛాంపియన్' - ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఫిక్స్... ఫుల్ డీటెయిల్స్ ఇవే!