స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కథానాయకుడిగా ప్రముఖ స్టయిలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తెలుసు కదా' (Telusu Kada Movie). ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. థియేటర్లలోకి అక్టోబర్ 17న విడుదలకు రెడీ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
సెప్టెంబర్ 11న 'తెలుసు కదా' టీజర్ విడుదల!'తెలుసు కదా' సినిమాను ఇప్పటికే విడుదలైన 'మల్లికా గంధ' పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు 'తెలుసు కదా' టీజర్ (Telusu Kada Teaser)ను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఆ రోజు ఉదయం 11.11 గంటలకు టీజర్ విడుదల కానుంది.
టీజర్ విడుదల తేదీతో పాటు అందమైన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. 'తెలుసు కదా' సినిమాలో లవ్ ఫీల్ తెలిపేలా... బాల్కనీలో హీరోయిన్లు శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా నిలబడితే వాళ్ళను పక్కనుంచి చూస్తున్న సిద్ధూను చూపించడం బావుంది. ఇదొక ముక్కోణపు ప్రేమకథ. ఇందులో 'వైవా' హర్ష కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ దీపావళికి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.
Also Read: బాలీవుడ్ హీరోతో సాయి దుర్గా తేజ్ ఢీ... 'సంబరాల యేటిగట్టు'లో విలన్‌గా హిందీ స్టార్
Telusu Kada Movie Cast And Crew: సిద్ధూ జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా 'వైవా' హర్ష కీలక పాత్రలో నటిస్తున్న 'తెలుసు కదా' సినిమాకు రచన - దర్శకత్వం: నీరజ కోన, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్ - కృతి ప్రసాద్, నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,సంగీతం: థమన్ ఎస్, ఛాయాగ్రహణం: జ్ఞాన శేఖర్ వీఎస్, కూర్పు: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ.
Also Read: భుజంపై టాటూ చూపించిన త్రిష... ఆ టాటూ స్పెషాలిటీ ఏమిటో తెలుసా?