Siddu Jonnalagadda's Telusu Kada First Day Box Office Collection: స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'తెలుసు కదా'. విడుదలకు ముందు సాంగ్స్, టీజర్, ట్రైలర్లతో మంచి బజ్ తెచ్చుకుంది. కూల్ లవ్ స్టోరీ అనుకున్న ప్రేక్షకులకు ట్రైలర్ షాక్ ఇచ్చింది. డిస్కషన్ టాపిక్ అయ్యింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం షాక్ ఇచ్చాయి.
'జాక్' కంటే తక్కువ కలెక్షన్స్ ఏంటి?Net Collection Of Telusu Kada: 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' విజయాలతో జోరు మీద ఉన్న సిద్ధూ జొన్నలగడ్డకు 'జాక్ - వీడు కొంచెం క్రాక్' బ్రేకులు వేసింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అందరికీ తెలిసిందే. సిద్ధూ సైతం రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వవలసి వచ్చింది. ఆ ఫ్లాప్ మూవీ కంటే 'తెలుసు కదా' ఓపెనింగ్ డే కలెక్షన్ తక్కువ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయ్.
'తెలుసు కదా' పోస్టర్ మీద తెలుగుతో పాటు తమిళ్, కన్నడ టైటిల్స్ వేశారు. ఆ రెండు భాషల్లో రిలీజ్ చేసే ప్లాన్స్ చేసినా చివరకు తెలుగు ప్రేక్షకుల ముందుకు మాత్రమే సినిమాను తెచ్చారు. ఇండియా వరకు చూస్తే... ఈ మూవీ ఫస్ట్ డే నెట్ కలెక్షన్ రెండు కోట్లకు అటు ఇటుగా ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 'జాక్' మూవీ ఫస్ట్ డే ఇండియా నెట్ కలెక్షన్ 2.5 కోట్లు. దాని కంటే 'తెలుసు కదా'కు ఓ 50 లక్షలు తక్కువ వచ్చాయి. ఫైనల్ రిపోర్ట్ చూసినా సరే 'జాక్' తర్వాత ప్లేసులో 'తెలుసు కదా' ఉంటుందని విశ్లేషకుల అంచనా.
'తెలుసు కదా' సినిమాతో పాపులర్ స్టయిలిస్ట్ నీరజ కోన డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చారు. సిద్ధూ జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, 'కెజిఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. హీరో స్నేహితుడిగా కీలక పాత్రలో వైవా హర్ష నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.