August Movies: ఆగస్ట్ వచ్చేసింది... మూవీ లవర్స్‌కు పండుగే - ఈ మూవీస్ కోసం ఆడియన్స్ వెయిటింగ్
August 2025 Movies List: చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల అవెయిటెడ్ మూవీస్ వరకూ ఆగస్ట్ నెలలో థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆ లిస్ట్ ఓసారి చూస్తే...

August 2025 Theatrical Releases: మూవీ లవర్స్‌కు ఆగస్ట్ నెల ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందనుంది. ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మూవీస్ ఈ నెలలోనే సందడి చేయనున్నాయి. చిన్న మూవీస్‌తో పాటు రీ రిలీజ్‌ల వరకూ ఈ నెలలోనే రాబోతున్నాయి. మరి అవేంటో ఓసారి చూస్తే....
ఎన్టీఆర్, హృతిక్ 'వార్ 2'
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన అవెయిటెడ్ మూవీ 'వార్ 2'. ఎన్టీఆర్‌కు ఇదే ఫస్ట్ బాలీవుడ్ మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా... యశ్ రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్‌లో భాగంగా ఆరో చిత్రంగా దీన్ని నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
రజనీకాంత్ 'కూలీ'
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కూలీ'. తలైవాతో పాటు కింగ్ నాగార్జున, శ్రుతిహాసన్, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుట్టబొమ్మ పూజాహెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ మూవీ ఈ నెల 14న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
రవితేజ 'మాస్ జాతర'
మాస్ మహారాజ రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. ఈ మూవీతోనే భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా... సూర్య దేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగా... వినాయక చవితి సందర్భంగా ఈ నెల 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
నారా రోహిత్ 'సుందరకాండ'
యంగ్ హీరో నారా రోహిత్ లేటెస్ట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సుందరకాండ' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా... వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో అభినవ్ గోమటం, నరేష్ కీలక పాత్రలు పోషించారు.
Also Read: ఓటీటీల్లో ఈ వెబ్ సిరీస్‌లు అస్సలు మిస్ కావొద్దు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మరికొన్ని మూవీస్
- వీటితో పాటే టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'పరదా'. 'శుభం' ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- కమెడియన్ ప్రవీణ్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ హారర్ థ్రిల్లర్ 'బకాసుర రెస్టారెంట్'. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించగా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- యంగ్ హీరో నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'. విపిన్ దర్శకత్వం వహించగా... రబియా ఖాతూన్ హీరోయిన్‌గా నటించారు. రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 22న సినిమా రిలీజ్ కానుంది.
- కోలీవుడ్ డైరెక్టర్ కె.చంద్రు దర్శకత్వంలో కీర్తి సురేష్ కీలక పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ 'రివాల్వర్ రీటా' ఈ నెల 29న రిలీజ్ కానుంది.
- బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'పరమ్ సుందరి'. ఈ నెల 29న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















