అన్వేషించండి

Exhibitors VS Producers: పర్సంటేజ్ రగడపై టాలీవుడ్ అలర్ట్... సమస్య పరిష్కారానికి కమిటీ - అందులో సభ్యులు ఎవరంటే?

Tollywood Committee - Theatres Issue: తెలుగు చిత్రసీమలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారించడానికి 5 + 21 మంది సభ్యులతో కూడిన కమిటీ వేశారు. అందులో ఎవరెవరు ఉన్నారంటే?

తెలుగు చిత్రసీమలో వారం నుంచి రగులుతున్న ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ (Exhibitors VS Producers) రగడకు తాత్కాలికంగా తెర పడినట్టే. వసూళ్ళలో పర్సంటేజ్ కోరుతూ తొలుత ఎగ్జిబిటర్లు... తాము అందుకు సిద్ధమే కానీ ఇక నుంచి మొదలు చేసే సినిమాలకు ఇస్తామని, ఆల్రెడీ విడుదలకు సిద్ధమైన - షూట్‌లో ఉన్న సినిమాలకు ఇవ్వమని ప్రొడ్యూసర్లు పోటా పోటీ ప్రెస్ మీట్స్ నిర్వహించారు. ఈ సమస్య నేపథ్యంలో పరిష్కార మార్గం కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం అయ్యారు. ఆ వివరాలు...

సమస్య పరిష్కారానికి కమిటీ!
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం జరిగింది. అందులో పర్సంటేజ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశారు. ఈ సమస్యకు సముచిత పరిష్కారం అన్వేషించేందుకు, త్వరితగతిన పరిష్కరించేందుకు రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. 

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు - ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు, మెగా నిర్మాత అల్లు అరవింద్, ప్రస్తుతం తెలంగాణ ఎఫ్.డి.సి చైర్మన్ - వాణిజ్య మండలి మాజీ అధ్యక్షుడు 'దిల్' రాజు, సీనియర్ నిర్మాత - ప్రస్తుతం మహేష్ బాబు - రాజమౌళి కలయికలో 'వారణాసి' ప్రొడ్యూస్ చేస్తున్న కె.ఎల్. నారాయణ, గౌరవ కార్యదర్శి కె అశోక్ కుమార్... ఐదుగురితో ఓ ఉప కమిటీ ఏర్పాటు చేశారు. సమస్యలను అధ్యయనం చేయడానికి మరొక కమిటీ వేశారు. 

డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు... ఒక్కో రంగం నుంచి ఏడుగురు చొప్పున ఎంపిక చేసి మరొక కమిటీ వేశారు. ఆ సభ్యులు సురేష్ బాబు & బృంద సభ్యులతో కూడిన కమిటీ మార్గదర్శకత్వంలో విధులు నిర్వర్తిస్తుంది. 

నిర్మాతల రంగం నుంచి ఎవరెవరు ఉన్నారంటే?

  1. వై. సురేందర్ రెడ్డి
  2. వై. సుప్రియ (అన్నపూర్ణ స్టూడియోస్)
  3. వై. రవి శంకర్ (మైత్రి మూవీ మేకర్స్)
  4. బి. బాపినీడు (శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర)
  5. చెరుకూరి సుధాకర్ (ఎస్.ఎల్.వి సినిమాస్)
  6. జి. శ్రీనివాస్ కుమార్ (SKN)
  7. టి. ప్రసన్న కుమార్

Also Read: 'ఆ నలుగురు' ఎవరు? వాళ్ళ చేతుల్లో ఏముంది? ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారా??

ఎగ్జిబిటర్స్ రంగం నుంచి ఎవరెవరు ఉన్నారంటే?

  1. వి. ప్రతాప్ రెడ్డి
  2. టి. బాల్గోవింద్ రాజ్
  3. కె. అనుపమ్ రెడ్డి
  4. పి. శ్రీనివాస రావు
  5. జి. వీరనారాయణ బాబు
  6. కె. వంశీ కిషోర్ (చిన్ని)
  7. ఎం. విజేందర్ రెడ్డి

Also Readథియేటర్స్ బంద్ కుట్ర వెనుక ద్వారంపూడి... వైసీపీ ఆటలో 'ఆ నలుగురు' పావులు అయ్యారా?

డిస్ట్రిబ్యూటర్స్ రంగం నుంచి ఎవరెవరు ఉన్నారంటే?

  1. డి. విష్ణు మూర్తి
  2. వి. వీరనాయుడు
  3. ఎన్. సుధాకర్ రెడ్డి
  4. ముత్యాల రామదాసు
  5. ఎన్. నాగార్జున
  6. బి. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు)
  7. ధీరజ్ మొగిలేని

ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ రగడ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నియమించిన కమిటీ... థియేటర్స్ సమస్యలను అధ్యయనం చేసి రెండు నెలలో నివేదిక సమర్పించనుంది. దాన్ని బట్టి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఈలోపు విడుదలయ్యే సినిమాలకు ఎటువంటి అడ్డంకి లేదని భావించవచ్చు.

Also Read: Dil Raju On Peddi Release: 'పెద్ది' విడుదలపై సందేహాలు వద్దు... ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ తర్వాత 'దిల్' రాజు క్లారిటీ

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishnu Priya :
"నా బాడీ కౌంట్‌ ఐదు" నెటిజన్‌ ప్రశ్నకు విష్ణు ప్రియ బోల్డ్ ఆన్సర్!
Hellallallo Video Song : హల్లల్లల్లో సాంగ్ ఫుల్ వీడియో - లిరిక్స్ To ఫుల్ సాంగ్
హల్లల్లల్లో సాంగ్ ఫుల్ వీడియో - లిరిక్స్ To ఫుల్ సాంగ్
Dhairye Sahase Amrutha OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Suriya Nelson Dilipkumar : జూ.ఎన్టీఆర్ కాదు... సూర్యతో నెల్సన్ మూవీ? - కామెడీ ఎంటర్టైనర్‌పై బిగ్ సర్‌ప్రైజ్
జూ.ఎన్టీఆర్ కాదు... సూర్యతో నెల్సన్ మూవీ? - కామెడీ ఎంటర్టైనర్‌పై బిగ్ సర్‌ప్రైజ్
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
Tamil Nadu Crop Loan Waiver 2026: తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
HYDERABAD METRO - THE ISSUE and THE STATUS | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
HYDERABAD METRO | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
Telegram Ban: టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం
టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం
Hyderabad Metro Phase 2 Loan Controversy: రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న మెట్రో ఫేజ్ 2 - రేవంత్ , కిషన్, కేటీఆర్ మధ్య పరస్పర ఆరోపణలు - పరిష్కారం ఉందా?
రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న మెట్రో ఫేజ్ 2 - రేవంత్ , కిషన్, కేటీఆర్ మధ్య పరస్పర ఆరోపణలు - పరిష్కారం ఉందా?
US Iran Peace Deal: ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
International Yoga Day: ఏపీలో పండుగలా యోగాడే నిర్వహణకు ఏర్పాట్లు - తెలంగాణలో లైట్ - ఎందుకలా?
ఏపీలో పండుగలా యోగాడే నిర్వహణకు ఏర్పాట్లు - తెలంగాణలో లైట్ - ఎందుకలా?
Vaibhav Suryavanshi: లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?
లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?
Embed widget