భారతీయ, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పట్ల ప్రజల్లో రోజు రోజుకూ ముక్కువ పెరుగుతోంది. దేశంలో ప్రజలు మాత్రమే కాదు... విదేశాలకు వెళ్లిన వాళ్ళు సైతం సాంప్రదాయ నృత్యం నేర్చుకుంటున్నారు. సంస్కృతి మీద వీడియోలు కూడా చేస్తున్నారు. ప్రఖ్యాత సినీ కళాకారిణి ప్రశాంతి హారతి, ఆమె కుమార్తె తాన్యా హారతిలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలు వివరాల్లోకి వెళితే...
ఇంద్రలో చిరంజీవి మేనకోడలిగా...
ప్రశాంతి హారతి (Prashanthi Harathi) ఈ తరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. ఓ తరం ముందుకు వెళితే... తెలుగు ప్రేక్షకులు ఆమెను గుర్తు పడతారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ ఫ్యాక్షన్ సినిమా 'ఇంద్ర'. ఆ చిత్రంలో హీరో మేనకోడలిగా ఆమె నటించారు. అంతకు ముందు 'పెళ్ళాం ఊరెళితే' సినిమాలోనూ నటించారు. తెలుగు సినిమా పాటలు కొన్నిటికి ప్రశాంతి హారతి కొరియోగ్రఫీ కూడా చేశారు.
తెలుగు చిత్రసీమలో కొన్నేళ్ళు పని చేసిన తర్వాత ప్రశాంతి హారతి కుటుంబం అమెరికాకు షిఫ్ట్ అయ్యింది. విదేశాలు వెళ్లినా సరే... కళపై ఆమెకు ఉన్న మక్కువ తగ్గలేదు. 'తెలుగింటి సంస్కృతి' పేరుతో ఓ మ్యూజికల్ వీడియో రూపొందించారు. ఆ పాటకు ఆమె కొరియోగ్రాఫీ అందించడంతో పాటు ఓ పాత్రలో కూడా కనిపించారు. ప్రశాంతి హారతి కుమార్తె తాన్యా హారతి (Tanya Harathi) సైతం కూచిపూడి నృత్యం చేస్తూ కనిపించారు. 'తెలుగింటి సంస్కృతి' మ్యూజికల్ వీడియో (Teluginti Samskruthi Music Video) నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషించారు. కిరణ్ గుడిపల్లి ఒక ముఖ్యమైన పాత్ర వహించారు.
Also Read : రాజమౌళి @ 50 - భారతీయ సినిమా బ్రాండ్ అంబాసిడర్ నెక్స్ట్ టార్గెట్ హాలీవుడ్ కుంభస్థలమే
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ (KRK YouTube Channel) లో 'తెలుగింటి సంస్కృతి' మ్యూజికల్ వీడియో విడుదల అయ్యింది. ఆల్రెడీ వన్ మిలియన్ వ్యూస్ సాధించింది. దాంతో టెక్సాస్(Texas USA)లోని ఫ్రిస్కోలో ఆదివారం, అక్టోబర్ 1వ తేదీన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రతిభావంతులైన శ్యామ్ కట్రు, పృథ్వీ తేజ, కమల్ నందికొండలతో కూడిన కెమెరా బృందం, మ్యూజిక్ వీడియోలోని ప్రతి దృశ్యాన్ని అందంగా మలిచినందుకు థాంక్స్ చెప్పారు. అలాగే, 'తెలుగింటి సంస్కృతి'ని తన ప్రతిష్టాత్మక యూట్యూబ్ ఛానెల్ #KRRWorksలో ప్రదర్శించినందుకు, ప్రముఖ దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు గారికి టీమ్ తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Also Read : త్రివిక్రమ్ - ప్రేక్షకుడితో నడిచే జీవితం, ఎప్పటికీ మరువలేని పుస్తకం!
ఈ వేడుకకు FISD (ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్) వైస్ ప్రెసిడెంట్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గోపాల్ పొనంగి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. 'తెలుగింటి సంస్కృతి' మ్యూజికల్ వీడియో బృందానికి అభినందనలను తెలియ జేశారు. ఈ విజయానికి దోహదపడిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య గారికి హృదయపూర్వక ప్రశాంతి హారతి, తాన్యా హారతి కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial