అన్వేషించండి

Ashu Reddy Case : అషు రెడ్డికి బిగ్ షాక్ - హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు

Ashu Reddy Reaction : బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. పెళ్లి పేరుతో NRIను మోసగించారన్న ఆరోపణలపై విచారణను నిలిపేయాలన్న ఆమె పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

Telangana High Court Rejects Stay In Ashu Reddy Case : బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పెళ్లి పేరుతో ఓ ఎన్ఆర్ఐను రూ.9.35 కోట్ల మేర మోసం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నిలిపేయాలన్న ఆమె పిటిషన్‌ను హైకోర్టు రిజెక్ట్ చేసింది. తనపై, తన తల్లి యశోద రెడ్డిపై విచారణ నిలిపేయాలని ఆమె పిటిషన్ వేయగా అందుకు కోర్టు నిరాకరించింది. కఠిన చర్యల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా కోర్టు అంగీకరించలేదు.

రంగంలోకి దిగిన పోలీసులు

హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. స్టే విధించాలన్న అషు రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం... దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని తెలిపింది. చట్టపరమైన ప్రక్రియ అనుసరించాల్సిందేనంటూ స్పష్టం చేయడంతో అషు రెడ్డి తల్లి కూడా కేసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

అషు రెడ్డికి సంబంధించి బ్యాంక్ లావాదేవీలు స్పష్టంగా ఉన్నాయంటూ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దాదాపు రూ.10 కోట్ల నగదు ఆన్ లైన్ ద్వారానే ట్రాన్స్‌ఫర్ అయ్యిందని కోర్టుకు తెలిపారు. విచారణ జరగాల్సి ఉన్నందున... ఇప్పటికే పిటిషనర్‌కు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తుపై స్టే విధించేందుకు నిరాకరిస్తూ విచారణ కంటిన్యూ అయ్యేలా ఆదేశాలిచ్చింది. 

Also Read : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి - డెకాయిట్ నుంచి వాలా 2 వరకూ... ఈ మూవీస్ డోంట్ మిస్

అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ షేక్ పేటకు చెందిన సత్యనారాయణ... తన కుమారుడిని పెళ్లి పేరుతో అషు రెడ్డి మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించారు. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన తన కొడుకు ధర్మేంద్రను రూ.9.35 కోట్ల మేర మోసగించిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2018లో ధర్మేంద్ర భారత్‌కు వచ్చిన టైంలో పరిచయం చేసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో డబ్బులు అడిగిందని చెప్పారు. కార్లు, ఆస్తులు, బంగారం కొనుగోలు చేసి తన పేరిట రిజిస్టర్ చేయించుకుందని ఆరోపించారు. పెళ్లి పేరెత్తితే మాత్రం తప్పించుకు తిరుగుతుందని తెలిపారు.

దీంతో అషు రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు, తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాయడం నిలిపేయాలంటూ అషు రెడ్డి కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం... ఆమె పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వార్తలు రాయొద్దని ఆదేశించింది. అయితే, కేసు విచారణను నిలిపేయాలన్న పిటిషన్‌పై మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.

అషు రెడ్డి వాదన ఏంటంటే?

ఈ కేసుకు సంబంధించి అంతకు ముందు కోర్టులో అషు రెడ్డి వాదనలు వినిపించారు. ఇద్దరి మధ్య పెళ్లికి కానీ, లెక్కలకు కానీ సంబంధించిన రాతపూర్వక అగ్రిమెంట్స్ లేవని... ఆయన ఇష్టపూర్వకంగానే ఆ ఖర్చులు చేశారని వాదించినట్లు తెలుస్తోంది. తనను, తన కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించే క్రమంలో, తన ఫ్యామిలీని మచ్చిక చేసుకునేందుకే అవన్నీ ఖర్చు చేసినట్లు పేర్కొందట. ఆ ఖర్చులకు తాను బాధ్యత వహించబోనని చెప్పినట్లు సమాచారం. ఇక హైకోర్టు ఆదేశాలతో విచారణ సాగుతున్న క్రమంలో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pandu Master : పండు మాస్టర్‌‌ సర్జరీ - ఏపీ మంత్రి ఆర్థిక సాయం... లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
పండు మాస్టర్‌‌ సర్జరీ - ఏపీ మంత్రి ఆర్థిక సాయం... లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Dragon: శ్రీలంకకు ఎన్టీఆర్ 'డ్రాగన్'... వచ్చే నెలలో యాక్షన్ వేట మొదలు
శ్రీలంకకు ఎన్టీఆర్ 'డ్రాగన్'... వచ్చే నెలలో యాక్షన్ వేట మొదలు
Nag Ashwin : నేలపై కూర్చున్న నాగ్ అశ్విన్ - సినిమా కంటే తననే ప్రేమిస్తాడన్న సింగీతం... ఎమోషనల్ మూమెంట్స్
నేలపై కూర్చున్న నాగ్ అశ్విన్ - సినిమా కంటే తననే ప్రేమిస్తాడన్న సింగీతం... ఎమోషనల్ మూమెంట్స్
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Embed widget