Peddi Songs : మన పెద్ది గాడి కోసం సాంగ్ - ఇక మాటల్లేవ్... థియేటర్స్ దద్దరిల్లాల్సిందే...
Peddi Trailer : తెలంగాణ ఉద్యమ పాటలకు ఊపిరి పోసిన రైటర్ మిట్టపల్లి సురేందర్ పెద్దిలో పాట రాశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేశారు.

Folk Song In Ram Charan's Peddi Movie : 'రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా...', 'వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు', 'నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరే నే చిత్తరువైతిరయ్యో'... ఈ సాంగ్స్ అచ్చమైన తెలంగాణ జానపదాన్ని గుర్తు చేయడం సహా లవ్, ఎమోషన్, అన్నింటినీ గుర్తు చేస్తాయి. ఈ పాటలకు ప్రాణం పోసింది తెలంగాణ ఫోక్ రైటర్ మిట్టపల్లి సురేందర్. తెలంగాణ ఉద్యమ పాటలకు ఊపిరి పోసిన ఈ రైటర్... ఇప్పుడు రామ్ చరణ్ 'పెద్ది'లోనే ఓ పాట రాశారు.
ఆ సాంగ్ ఏంటి?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేశారు. 'చికిరి చికిరి'తో పాటు 'రయ్ రయ్ రా రా' సాంగ్స్ ట్రెండ్ క్రియేట్ చేశాయి. 'చికిరి చికిరి' హీరో లవ్ ఫీల్ ఎక్స్‌ప్రెస్ చేయగా... 'రయ్ రయ్ రా రా' సాంగ్ ప్రజెంట్ యూత్ ఎలా ఉండాలో చెప్పేలా ఇన్స్‌పిరేషన్‌తో ఉంటుంది.
మరి మిట్టపల్లి సురేందర్ పాట కూడా జానపదం, పల్లెతనం ఉట్టిపడేలా ఉంటుందని భావిస్తున్నారు. 'మాటల్లేవురా సాంబ పాట రాస్కో' ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్, డైరెక్టర్ బుచ్చిబాబులతో కలిగి దిగిన ఫోటోలను సురేందర్ ఇన్ స్టాలో షేర్ చేశారు. 'సిరా చుక్కతో RC కాంబో అంటే నెత్తురు ఉరుకుతుందేమో అన్న' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read : డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
'దంగల్'ను మించి...
ఈ మూవీ కుస్తీ నేపథ్యంలో సాగుతుందని చెప్పారు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా. ఆడియన్స్‌కు ఎక్కడా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దంగల్‌ను గుర్తు చేయకూడదనే ఉద్దేశంతో స్పెషల్ సెట్స్ వేసినట్లు తెలిపారు. కొన్ని కొత్త ఆలోచనలు కూడా చేసినట్లు చెప్పారు. తన కెరీర్‌లోనే 'పెద్ది' గొప్ప స్క్రిప్ట్ అని... ఇలాంటి గొప్ప చిత్రానికి పని చేసే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ట్రైలర్ రెడీ
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 18న రిలీజ్ చేయనున్నారు. భారీగా ఈవెంట్ ప్లాన్ చేసి ట్రైలర్ కట్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు, రాంచీలో ఓ ఈవెంట్ ప్లాన్ చేసి క్రికెట్ లెజెండ్ ధోనీని చీఫ్ గెస్ట్‌గా పిలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 23న భోపాల్‌లో ఓ భారీ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించాలని చూస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈవెంట్‌కు మూవీ టీం హాజరు కానుంది. చరణ్, శ్రుతి హాసన్‌ల స్పెషల్ సాంగ్ ఆ రోజున రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు, సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















