Sankranthiki Vasthunam Song : విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా సెకండ్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేశారు.
వెంకీ మామ బర్త్ డే ట్రీట్ అదుర్స్
వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ 'గోదారి గట్టు మీద రామచిలకవే' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నామంటూ ముందుగానే అప్డేట్ ఇచ్చారు. వెంకీ మామ బర్త్ డే సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి ఈ సినిమాలోని 'మీనూ' సాంగ్ నేను ప్రోమోను ఈరోజు రిలీజ్ చేయబోతున్నట్టు నిన్ననే అనౌన్స్ చేశారు. చెప్పినట్టుగానే తాజాగా ఈ సినిమాలో 'మీనూ' అనే పాట ప్రోమోను రిలీజ్ చేశారు. కేవలం 43 సెకండ్ల నిడివి ఉన్న ఈ ప్రోమోలో మీనాక్షి చౌదరి కోపంగా కనిపిస్తోంది. అయితే లిరిక్స్ ద్వారా వెంకటేష్ తన లవ్ స్టోరీని ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించింది.
వింటేజ్ లుక్ లో వెంకటేష్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి తాజాగా వెంకటేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన 'మీనూ' ప్రోమో చూడ్డానికే కాదు వినడానికి కూడా బాగుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక తాజా సాంగ్ 'మీనూ'కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. భీమ్స్ సిసిరోలియోతో పాటు ప్రణవి ఆచార్య ఈ పాటను పాడారు. అయితే ప్రోమోలో మధ్యలో వెంకటేష్ తన లవ్ స్టోరీని చెప్పడం మొదలు పెట్టారు. ఆ టైంలో వెంకటేష్ 'ఘర్షణ' సినిమాలోని వింటేజ్ పోలీస్ లుక్ లో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు చూసి, అన్ని మంచి క్లాసిక్ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇందులో వెంకటేష్ పక్కా ఫ్యామిలీ మెన్ గా కనిపించబోతున్నారు. ఈ ఏడాది 'సైంధవ్' మూవీతో పలకరించిన వెంకటేష్ కు నిరాశ తప్పలేదు. మరి రనున్న సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ కలిసి వస్తుందా? అనేది చూడాలి.
Also Read : ఆంజనేయస్వామి మీద ఒట్టేసి చెబుతున్న... తేజు ఊచకోత చూస్తారు - 'సంబరాల ఏటిగట్టు' కార్నేజ్ లాంచ్లో రామ్ చరణ్