Taraka Ratna Wife Alekhya Emotional: ఏడాది క్రితం అంటే ఫిబ్రవరి, 18 2003లో టాలీవుడ్‌ తీవ్ర విషాదం నెలకొంది. నటుడు నందమూరి తారకరత్న గతేడాది గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం నందమూరి కుటుంబం, సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ముఖ్యంగా ఫ్యాన్స్‌ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. నారా లోకేష్‌ 'యువగళం' పాతయాత్ర ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆస్పత్రిలో చేర్పించిన ఆయన దాదాపు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయారు. తారకరత్న మరణంతో ఆయన కుటుంబం ఒంటరైంది. 


అప్పటి నుంచి అలేఖ్యా రెడ్డి తరచూ భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంంటూ సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ అవుతున్నారు. ఆయన మరణించి ఏడాది గడిచిన ఇప్పటికీ భార్య, పిల్లలు విషాదంలోనే ఉన్నారు. అతడిని మర్చిపోలేని అలేఖ్యా తరచూ భర్తను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరవుతున్న.  క్రమంతో తాజాగా ఓ టీవీ షోకు హాజరైన ఆమెకు తారకరత్నను గుర్తుచేశారు. దీంతో అలేఖ్య స్టేజ్‌పైనే కన్నీరుపెట్టుకున్నారు. ఇప్పటికే భర్తను కొల్పోయి పుట్టేడు దు:ఖంలో ఉన్న ఆమెకు మరోసారి ఆయనను గుర్తు చేసి మరింత బాధపెట్టినట్టు అయ్యింది. ఇప్పుడు దీనిపైనే నెటిజన్లు మండిపడుతూ సదరు టీవీ చానల్‌ను తిట్టిపోస్తున్నారు. 






స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్న అలేఖ్య


ప్రముఖ టీవీ ఛానల్‌ 'జీ తెలుగు' శివంగి' పేరుతో ఓ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మహిళా దినోత్సవం(ఉమెన్స్‌ డే) సందర్భంగా ఆడవాళ్ల కోసం స్పెషల్‌ ఎపిసోడ్‌ను నిర్వహించారు. దీనికి దివంగత నటుడు, రెబల్‌ స్టార్‌ సతీమణి శ్యామలాదేవి, తారకరత్నా భార్య అలేఖ్యారెడ్డి, కూతురు నిష్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిట్‌లో భాగంగా నటరాజ్‌ మాస్టర్‌ తారకరత్న జర్నీని స్టేజ్‌పై ఆవిష్కరించారు. డ్యాన్స్‌తో ఇందులో తారకరత్న, ఆయన భార్య అలేఖ్యా, కూతురు నిష్క పాత్రలతో ఎమోషన్‌ పండించారు. అదీ చూసిన అలేఖ్య, కూతురు నిష్క ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు. స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకోవడంతో అది చూసి అక్కడ ఉన్నావరు కూడా ఎమోషనల్‌ అయ్యారు.


తిట్టుపోస్తున్న నెటిజన్లు


దీంతో షోలో ఒక్కసారిగా అంతా నిశబ్ధ వాతావరణం నెలకొంది. ఆ పర్ఫామెన్స్‌ చూసిన అలేఖ్య రెడ్డికి నోటి వెంట మాటలు రాలేదు. ఉబికివస్తున్న కన్నీరుతో అలాగే ఉండిపోయి భర్తను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్‌గా విడుదల అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు సైతం ఎమోషనల్‌ అవుతున్నారు. అయితే దీనిపై కొందరు ఫ్యాన్స్‌, నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. చనిపోయిన వారిని కూడా వదలడం లేదని, పక్కవారి కన్నీళ్లతో డబ్బులు సంపాదించుకోవాలని చూసేవే ఈ చెత్త చానళ్లు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'పిలిచి మరి ఏడిపిస్తున్న చాడిస్టులు',' ఈ టీవీ ఛానల్‌ వాళ్లు, చనిపోయిన వారి మీద టీఆర్పీ పెంచుకుంటారు బ్రో.. ఎందుకు వాళ్లని మళ్లీ ఏడిపిస్తారు', 'ఎదుటి వారి కన్నీళ్లతో డబ్బు సంపాదించే ఆ రూపాయి తిరిగి కన్నీళ్లే పెట్టిస్తుంది' అంటూ సదరు టీవీ చానల్‌పై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. 


Also Read: విడాకులైన సమంతను ఫాలో అవుతున్న చైతన్య - తెలుసుగా, మేం మారం బాస్‌..