యువ కథానాయకుడు, రాజకీయ నేత నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) ఫిబ్రవరి 18న మరణించారు. ఈ రోజు (మార్చి 18న) ఆయన భార్య అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తారక రత్న మరణించి నెల రోజులైనా ఆయన జ్ఞాపకాలు తన మనసులో ఇంకా సజీవంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తమ ప్రయాణం మొదలైన రోజులను గుర్తు చేసుకున్నారు. 


డేటింగ్ స్టార్ట్ చేసినప్పుడు...
''మనం కలిశాం, మనం మంచి స్నేహితులు అయ్యాం, మనం డేటింగ్ చేయడం స్టార్ట్ చేశాం... మన బంధం గురించి అప్పట్లో నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పటికీ... మన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావ్. ఆ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి నువ్వు యుద్ధం చేయడం స్టార్ట్ చేశావ్'' అని తమ ప్రయాణం ప్రారంభమైన తొలినాళ్లలో సంగతులు చెప్పుకొచ్చారు. 


పెళ్లి తర్వాత వివక్ష...
తారక రత్న, తాను పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి తమకు కష్టాలు మొదలు అయ్యాయని అలేఖ్యా రెడ్డి పేర్కొన్నారు. తమపై వివక్ష చూపించారని, అయినా తాము బతికామని, సంతోషంగా ఉన్నామని ఆమె వివరించారు. పెద్దమ్మాయి నిష్కమ్మ జన్మించిన తర్వాత తమ ఆనందం రెట్టింపు అయ్యిందని తెలిపారు. అయితే, ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. 2019లో కవలలు జన్మించడం తమకు సర్‌ప్రైజ్ అన్నారు. తారక రత్న ఎప్పుడూ పెద్ద కుటుంబం కావాలని కోరుకునే వారని, ఇప్పుడు తనను మిస్ అవుతున్నామని అలేఖ్యా రెడ్డి తెలిపారు. 


గుండెల్లో బాధను ఎవరూ చూడలేదు!
తమ పెళ్లి నుంచి తారక రత్న మరణం వరకు తాము ఇబ్బందులు పడ్డామనేది నిజమని అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ''నువ్వు (తారక రత్న) గుండెల్లో మోసిన బాధను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎవరూ ఆ బాధను చూడలేదు. కష్టాల్లో నేను నీకు సాయం చేయలేకపోయా. మన ప్రయాణం మొదలైన తరుణం నుంచి చివరకు వరకు... మనకు అండగా ఉన్న వ్యక్తులు మాత్రమే మనతో ఉన్నారు. నువ్వే మా రియల్ హీరో ఓబు. కుటుంబంగా నిన్ను చూసి మేం గర్విస్తున్నాం. ప్రశాంతత, సంతోషం ఉన్న చోటు మళ్ళీ మనం కలుద్దాం'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.


Also Read : 'రంగస్థలం'లో చిట్టిబాబును మించి - ఒక్క మాటతో హైప్ పెంచేసిన రామ్ చరణ్






తారక రత్న మరణం నుంచి అలేఖ్యా రెడ్డి ఈ విధమైన సెన్సేషనల్ పోస్టులు చేస్తున్నారు. బాలకృష్ణ ఒక్కరే తమ కుటుంబమని కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేశారు. ''మంచి చెడుల్లో మాకు అండగా, కొండలా.... చివరి వరకు మా వెంట నిలబడింది ఒక్కరే. మేం కుటుంబం అని పిలిచేది ఒక్కరినే (బాలకృష్ణను). ఓ తండ్రిలా తారక రత్నను ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు.  ఆస్పత్రిలో బెడ్ పక్కన కూర్చుని ఓ తల్లిలా పాటలు పాడి వినిపించారు. తారక రత్న రియాక్ట్ అవ్వాలని జోక్స్ వేసేవారు. చుట్టు పక్కల ఎవరూ లేనప్పుడు... ఒంటరిగా కన్నీరు పెట్టుకునేవారు. ఆయన ఎప్పుడూ మా వెంట ఉన్నారు. ఓబు (తారక రత్నను కుటుంబ సభ్యులు పిలిచే పేరు)... నువ్వు ఇంకొన్ని రోజులు ఉండాల్సింది. నిన్ను మేం బాగా మిస్ అవుతున్నాం'' అని అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేశారు.


Also Read : ట్విట్టర్‌లో అల్లు అర్జున్ హీరోయిన్ లొల్లి - బన్నీ బ్లాక్ చేసి అన్‌బ్లాక్ చేశాడని