Tamil Producer K Rajan Death: నదిలో దూకి తమిళ నిర్మాత ఆత్మహత్య... షాక్‌లో కోలీవుడ్
K Rajan Suicide News: తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. నిర్మాత కె రాజన్ ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Producer K Rajan death reason: తమిళ చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నిర్మాత, దర్శకుడు, నటుడు కె. రాజన్ మరణ వార్త కోలీవుడ్ ప్రముఖుల్ని షాక్‌కి గురి చేసింది. ఆయన వయసు 85 ఏళ్ళు. ఆదివారం చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. అది మరింత దిగ్భ్రాంతికి గురి చేసింది.
బ్రిడ్జ్ నుంచి నదిలోకి దూకి ఆత్మహత్య
చెన్నైలోని అడయార్ బ్రిడ్జి మీద నుంచి నదిలోకి కె రాజన్ దూకారని ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే... ఆయన బలవన్మరణానికి గల కారణాలు ఏమిటి? అనేది ఇంకా తెలియలేదు. రాజన్ మృతికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఆయన ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
రాజన్ మృతి పట్ల చిత్రసీమ ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి? అనేది మిస్టరీగా మారింది.
In a bizarre and shocking incident Tamil film producer K. Rajan (85) known for his bold statements died by suicide after jumping into the Adyar River in Chennai. pic.twitter.com/PuqtZY4CBP
— Sreedhar Pillai (@sri50) May 17, 2026
చిత్రసీమలో నాలుగు దశాబ్దాల ప్రయాణం
తమిళ చిత్రసీమలో కె. రాజన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందారు. ఆయన కేవలం నిర్మాత మాత్రమే కాదు... రచయిత, దర్శకుడు, నటుడు కూడా! తమిళ చిత్ర పరిశ్రమలో 'బ్రహ్మచారిగళ్' సినిమాతో నిర్మాతగా ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను నిర్మించారు. 'డబుల్స్', 'అవల్ పావం', 'నినైకాద నాలై' వంటి సినిమాలు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాయి.
Also Read: Chiranjeevi 158th Movie - మెగా 158కు ముహూర్తం ఫిక్స్... చిరంజీవి వర్కవుట్స్ వెనుక మెయిన్ రీజన్
மே 17
— Actor Kayal Devaraj (@kayaldevaraj) May 17, 2026
திரைப்பட தயாரிப்பாளர், இயக்குனர், நடிகர், விநியோகஸ்தர் கே.ராஜன் (வயது 85), சென்னை அடையாறு ஆற்றில் விழுந்து தற்கொலை. போலீசார் தீவிர விசாரணை நடத்துகின்றனர். திரையுலகினர் பலத்த அதிர்ச்சி அடைந்துள்ளனர்.#KRajan #RIPKRajan pic.twitter.com/PdheW8Fggy
నిళల్గల్ రవి, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన 'నమ్మ ఊరు మారియమ్మ' సినిమాతో కె రాజన్ దర్శకుడిగా మారారు. అలాగే, 'ఉనర్చిగల్' (2005)కి కూడా దర్శకత్వం వహించారు. 'తంగమన తంగచ్చి'కి కథ అందించారు.
అజిత్ 'తునివు'తో పలు సినిమాల్లో నటుడిగా...
K Rajan Films As Actor: అజిత్ కుమార్ 'తునివు' (తెలుగులో 'తెగింపు')తో పాటు సెల్వ రాఘవన్ 'బకాసురన్', 'మైఖేల్ రాజ్', 'సొంతక్కారన్', 'వీట్టోడ మాపిళ్ళై', 'పాంబు సాటై' సినిమాల్లో కె రాజన్ నటించారు. ఆయన కుమారుడే ప్రభుకాంత్. నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన... ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన 'ఎల్కేజీ'కి దర్శకత్వం వహించారు.
Also Read: Ravi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















