Tamannaah Bhatia: ఫ్రీ ఫ్రీ ఫ్రీ... ఒక్క రూపాయి తీసుకోలేదు - ఫ్రీగా బాలీవుడ్ సినిమా చేసిన తమన్నా
Tamannaah Bhatia Latest Hindi Movie: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటుంది. స్పెషల్ సాంగ్ చేసినా సరే లక్షలు ఇవ్వడానికి నిర్మాతలు రెడీ. అటువంటి తమన్నా ఓ సినిమా ఫ్రీగా చేశారు.

తెలుగులో ఆల్మోస్ట్ ఆల్ స్టార్ హీరోలు అందరితో నటించిన హీరోయిన్ తమన్నా భాటియా. నార్త్ ఇండియన్ బ్యూటీ అయినప్పటికీ సౌత్ ఇండియన్స్ ఆమెను ఎక్కువగా ఆదరించారు. తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ స్టేటస్ వచ్చాక.... నెమ్మదిగా హిందీలోనూ అడుగులు వేశారు. బాలీవుడ్ సినిమాల్లో తమన్నా భాటియా చేసిన స్పెషల్ సాంగ్స్ వైరల్ అయ్యాయి. బ్లాక్ బస్టర్స్ కావడంతో ఆమె పేరు మార్మోగింది. తమన్నా రెమ్యూనరేషన్ కూడా తక్కువేం కాదు. ఒక్కో సినిమాకు ఆమెకు కోట్లలో ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు రెడీ. స్పెషల్ సాంగ్ చేసేందుకు 'ఎస్' అంటే లక్షల్లో డబ్బులు వస్తాయి. అటువంటి తమన్నా ఓ సినిమా ఫ్రీగా చేసిందంటే నమ్ముతారా?
ఓ రోమియో... ఒక్క రూపాయి తీసుకోలేదు!
Tamannaah Bhatia remuneration for O Romeo: షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఓ రోమియో'. ఇందులో 'యానిమల్' ఫేమ్ తృప్తి డిమ్రి హీరోయిన్. అయితే... ఈ సినిమాలో తమన్నా కూడా ఉన్నారు. ట్రైలర్‌లో ఆమెను చూపించారు. సినిమాలో క్యారెక్టర్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఈ సినిమా కోసం తమన్నా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.
View this post on Instagram
తమన్నా రెమ్యూనరేషన్ తీసుకోలేదని, తమ సినిమాను ఫ్రీగా చేసిందని 'ఓ రోమియో' దర్శకుడు విశాల్ భరద్వాజ్ చెప్పారు. కథపై నమ్మకం ఉండటంతో చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా మీద గౌరవంతో తమన్నా డబ్బులు తీసుకోలేదని ఆయన చెప్పారు. తమన్నా మాత్రమే కాదు... సినిమాలో కీలక పాత్ర చేసిన '12th ఫెయిల్' హీరో విక్రాంత్ మాసే కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఆయన కూడా ఫ్రీగా చేశారని చెప్పారు. ఫిబ్రవరి 13న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.
View this post on Instagram
తమన్నా తెలుగు సినిమాల విషయానికి వస్తే... సంపత్ నంది 'ఓదెల 2' తర్వాత ఆవిడ మరో సినిమాకు సంతకం చేయలేదు. తమిళంలో 'పరశురామ్' అని ఓ సినిమా చేస్తున్నారు. హిందీలో నాలుగైదు సినిమాలు ఓకే చేశారు.























