కాన్సెప్ట్ బెస్ట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ... కంటెంట్ ఓరియంటెడ్ డిఫరెంట్ ఫిలిమ్స్ చేసే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha). ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. రెండు హిస్టారికల్ బేస్డ్ ఫిలిమ్స్ ఆయన చేతిలో ఉన్నాయి అందులో ఒక సినిమా టీజర్ త్వరలో విడుదల కానుంది.
నిఖిల్ పుట్టిన రోజుకు 'స్వయంభూ' టీజర్!నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'స్వయంభూ'. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ సిద్ధార్థ 20వ చిత్రమిది. 'ఠాగూర్' మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకం మీద భువన్, శ్రీకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: 'ఏస్' రివ్యూ: విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్... యోగిబాబు కామెడీ గట్టెక్కించిందా? మూవీ హిట్టేనా?
జూన్ 1న నిఖిల్ సిద్ధార్థ పుట్టిన రోజు (Swayambhu Telugu movie teaser). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'స్వయంభూ' సినిమా టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలిసింది. అదే రోజు నిఖిల్ సిద్ధార్థ హీరోగా రూపొందుతున్న మరో పాన్ ఇండియా మూవీ 'ఇండియా హౌస్' నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల కానుందని తెలిసింది.
నిఖిల్ సరసన ఇద్దరు హీరోయిన్లు!'స్వయంభూ' సినిమాలో నిఖిల్ సిద్ధార్థ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సుందర వల్లిగా రాయల్ ప్రిన్సెన్స్ రోల్ చేస్తున్నారు నభా నటేష్. సంయుక్త సైతం ఇప్పటి వరకు చూడనటువంటి కొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాకరన్, సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి - జిటి ఆనంద్, సంగీతం: రవి బస్రూర్, ఛాయాగ్రహణం: కేకే సెంథిల్ కుమార్, నిర్మాతలు: భువన్ - శ్రీకర్, రచన - దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి.
Also Read: వైసీపీ కాదు... 'బాయ్‌కాట్ భైరవం' అంటోన్న మెగా ఫ్యాన్స్... సారీ చెప్పిన దర్శకుడు విజయ్ కనకమేడల