Swayambhu Teaser : నిఖిల్ 'స్వయంభు' టీజర్ వచ్చేస్తోంది - రెండేళ్ల వెయిటింగ్‌కు చెక్... మార్క్ దిస్ డేట్
Swayambhu Teaser Release Date : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ హిస్టారికల్ ఎపిక్ 'స్వయంభు' టీజర్ వచ్చేస్తోంది. ఈ నెల 11న టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Nikhil Siddhartha's Swayambhu Teaser Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ లేటెస్ట్ అవెయిటెడ్ హిస్టారికల్ డ్రామా 'స్వయంభు'. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన లుక్స్, స్పెషల్ వీడియో హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
టీజర్ ఎప్పుడంటే?
ఈ మూవీ టీజర్‌ను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. సోషల్ మీడియా వేదికగా హీరో నిఖిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. 'స్వయంభు ప్రపంచాన్ని మీకు చూపించడానికి రెండేళ్లుగా వెయిట్ చేశాను. చివరగా ఫిబ్రవరి 11న మనం కలిసి ఎపిక్ మిస్టికల్ టీజర్ చూస్తాం. ఈ డేట్ మార్క్ చేసుకోండి.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
View this post on Instagram
Also Read : అక్కినేని ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ - సోగ్గాడు మళ్లీ వచ్చేస్తున్నాడు... రిలీజ్ ఎప్పుడంటే?
రిలీజ్ డేట్ మారింది
ఈ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా... నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ మూవీని నిర్మిస్తున్నారు. రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తుండగా... బాహుబలి, RRR మూవీస్ ఫేం సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. చరిత్ర చూడని... చరిత్రలో చెప్పని ఓ గొప్ప వీరుడి కథను చూపించనున్నట్లు ముందు నుంచీ చెప్తూ వస్తున్నారు.
ఈ హిస్టారికల్ ఎపిక్‌లో నిఖిల్ వారియర్‌గా కనిపించనున్నారు. సినిమా ఈ నెల 13నే రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 13న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
























