తెలుగు సినిమా ఇండస్ట్రీలోని యంగ్ అండ్ ట్యాలెంటెడ్ ఆర్టిస్టుల్లో శివకుమార్ రామచంద్రవరపు (Shivakumar Ramachandravarapu) ఒకరు. అక్కినేని నాగ చైతన్య 'మజిలీ' నుంచి చూస్తే వరుణ్ తేజ్ 'తొలిప్రేమ', అడివి శేష్ 'హిట్ 2', నాని 'నిన్ను కోరి' సహా పలు సినిమాల్లో నటించారు. కథానాయకుడిగా 'ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం', 'సారంగదరియా' వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు శివకుమార్ రామచంద్రవరపు హీరోగా రూపొందుతున్న సినిమా 'సువర్ణ టెక్ట్స్‌టైల్స్'.
చీరకట్టిన శివకుమార్ రామచంద్రవరపు'సువర్ణ టెక్ట్స్‌టైల్స్'.... టైటిల్ చూస్తే క్లాత్ షోరూమ్ నేపథ్యంలో సినిమా అని అర్థం అవుతుంది. ఫస్ట్ లుక్ చూస్తే... అసలు ఈ సినిమాలో హీరో ఏం చేస్తాడు? అని ప్రతి ప్రేక్షకుడిలో కొంచెం కుతూహలం కలగడం సహజం. ఎందుకంటే... చీర కట్టుకుని బండి మీద వెళుతున్న హీరో శివకుమార్ రామచంద్రవరపు ఫోటో విడుదల చేశారు. అదీ సంగతి!
శివకుమార్ రామచంద్రవరపు హీరోగా నటిస్తున్న 'సువర్ణ టెక్ట్స్‌టైల్స్'. ఇందులో డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ ప్రధాన తారలు. ఈ చిత్రానికి ప్రశాంత్ నామిని దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.వై.వి.ప్రొడక్షన్స్, సనాతన క్రియేషన్స్ సంస్థలపై నిర్మాత అనిల్ ఈరుగుదిండ్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుందని, రెండు షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేసి ఆగస్టు 2026లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత అనిల్ తెలిపారు.
Also Read: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
ఫస్ట్ లుక్ పోస్టర్ రెస్పాన్స్ అదిరిందని, యువ ప్రేక్షకులలో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని దర్శకుడు ప్రశాంత్ నామిని తెలిపారు. ఇదొక అడల్ట్ కామెడీ సినిమా అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చందు ఏజే, సంగీతం: భరత్ ఎం, కూర్పు: బొంతల నాగేశ్వర రెడ్డి, కళా దర్శకత్వం: విజయ్ కుమార్ గాజుల, సాహిత్యం: రాంబాబు గోసల.