'వీరభద్రుడు' సినిమా మే 14, గురువారం థియేటర్లలో విడుదల కానుంది.
Trisha Krishnan: మళ్ళీ డుమ్మా కొట్టిన త్రిష... హైదరాబాద్ ఈవెంట్‌కూ పిలవలేదా?
Karuppu Release Date: మే 14న సూర్య 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') రిలీజ్. హైదరాబాద్‌లో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ కూడా త్రిష కనిపించలేదు.

- సూర్య 'వీరభద్రుడు' సినిమా మే 14న విడుదల, తమ్ముడు కార్తీ హాజరయ్యారు.
- హీరోయిన్ త్రిష ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గైర్హాజరు కావడంతో అభిమానులు ఆగ్రహం.
- రాజకీయాల్లో బిజీగా ఉన్న త్రిష, సినిమా ప్రమోషన్‌ను పట్టించుకోవట్లేదని విమర్శలు.
- త్రిష రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటంతో సినిమా ఈవెంట్‌లకు హాజరు కావడం లేదని భావన.
Veerabhadrudu Telugu Movie Release Date: 'వీరభద్రుడు'తో ఈ గురువారం (మే 14వ తేదీన) థియేటర్లలోకి రానున్నారు కోలీవుడ్ స్టార్ సూర్య. తమిళంలో తెరకెక్కిన 'కరుప్పు' (ఆల్రెడీ తమిళంలో రేర్ రికార్డు క్రియేట్ చేసింది) సినిమాకు తెలుగు డబ్బింగ్ ఇది. సూర్యతో పాటు తమ్ముడు కార్తీ కూడా సోమవారం రాత్రి జరిగిన 'వీరభద్రుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అటెండ్ అయ్యారు. అయితే... సినిమా హీరోయిన్ త్రిష మాత్రం కనిపించలేదు. ఆమె హైదరాబాద్ ఈవెంట్‌లోనూ కనిపించకుండా డుమ్మా కొట్టడంపై సూర్య ఫ్యాన్స్ గరం గరం అవుతున్నారు. ఎందుకంటే... ఇంతకు ముందు కూడా డుమ్మా కొట్టారు.
ఇప్పుడు కూడా త్రిషను పిలవలేదా?
'కరుప్పు' ఆడియో లాంచ్ మధురైలో జరిగింది. అక్కడ ఓ కాలేజీలో ఈవెంట్ చేశారు. అందులో త్రిష కనిపించలేదు. ఆ విషయమై సోషల్ మీడియాలో ఒక నెటిజన్ ప్రశ్నించగా... తన ఇన్వెటేషన్ మెయిల్‌లో పోయిందేమో అన్నట్టుగా ఆమె ఒక సెటైరికల్ ట్వీట్ చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడానికి ముందు 'కరుప్పు' ఆడియో లాంచ్ జరిగింది. అప్పటికి విజయ్ అధికారంలోకి వస్తారని గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి. విజయ్ - త్రిష వ్యవహారం మీద ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి బోలెడు విమర్శలు వచ్చాయి. సినిమాపై ఆ ఎఫెక్ట్ ఉండకూడదని 'కరుప్పు' టీమ్ భావించి ఉండొచ్చు. అందుకని చిత్ర బృందం పిలవలేదని అనుకోవచ్చు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
Also Read: Bollywood - విడాకుల దిశగా బాలీవుడ్ భామ... 'విశ్వంభర' ఐటమ్ సాంగ్ బ్యూటీ ఇచ్చిన హింట్ గమనించారా?
విజయ్ ఎన్నికల్లో విజయం సాధించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 'వీరభద్రుడు' వేడుకలో విజయ్ గురించి దర్శకుడు ఆర్.జె. బాలాజీ మాట్లాడారు. ఇక్కడ పవన్, అక్కడ విజయ్ అంటూ వాళ్ళిద్దరి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు త్రిష వస్తే సినిమాకు హెల్ప్ అవుతుంది. కానీ, ఆమె రాలేదు. విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన త్రిషకు... సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కు అటెండ్ అయ్యే తీరిక లేదా? అని సూర్య అభిమానులు కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆమె తీరుపై అప్ సెట్ అయ్యారు. మరి ఈసారి త్రిష ఏం సమాధానం చెబుతారో!?
Also Read: NTR Neel Movie First Glimpse - ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మిడ్ నైట్ సర్‌ప్రైజ్... బర్త్ డే కంటే ముందు
రాజకీయ వ్యవహారాల్లో త్రిష బిజీ బిజీ!?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి... రెండింటిలోనూ విజయం సాధించారు. ఇప్పుడు ఓ స్థానానికి రాజీనామా చేయక తప్పదు. అక్కడ నుంచి త్రిష పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేసినా విజయం సాధ్యమే. త్రిషను ఎమ్మెల్యే చేసి, ఆ తర్వాత డిప్యూటీ సీఎం చేస్తారా? లేదంటే విజయ్ మదిలో మరొక ఆలోచన ఉందా? అనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతానికి రాజకీయ వ్యవహారాల్లో త్రిష బిజీ బిజీగా ఉన్నారు. అందుకని సినిమాను లైట్ తీసుకున్నట్టు ఉన్నారు.
Also Read: Ashu Reddy Crying - వెక్కి వెక్కి ఏడ్చిన అషురెడ్డి... కారులో తల బాదుకుంటూ
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Frequently Asked Questions
'వీరభద్రుడు' సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?
'వీరభద్రుడు' ఏ సినిమాకు తెలుగు డబ్బింగ్?
'వీరభద్రుడు' అనేది తమిళంలో 'కరుప్పు' పేరుతో తెరకెక్కిన సినిమాకు తెలుగు డబ్బింగ్.
'వీరభద్రుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎవరు హాజరయ్యారు?
'వీరభద్రుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూర్యతో పాటు ఆయన తమ్ముడు కార్తీ కూడా హాజరయ్యారు.
త్రిష 'వీరభద్రుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎందుకు హాజరు కాలేదు?
త్రిష 'వీరభద్రుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాలేదు. ఆమె రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారని భావిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















