Suriya 46: సూర్య సినిమాలో రవీనా టాండన్... ఇట్స్ అఫీషియల్!
Raveena Tandon In Suriya 46: కోలీవుడ్ స్టార్ సూర్య శివకుమార్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కీలక పాత్ర చేస్తున్నారు.

టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య శివకుమార్ (Suriya Sivakumar) ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర వంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ నటిస్తున్నారు.
సూర్య సినిమా రవీనా టాండన్!
Raveena Tandon Joins Suriya 46: సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో రవీనా టాండన్ నటిస్తున్న విషయాన్ని నిర్మాతలు ఆదివారం అధికారికంగా అనౌన్స్ చేశారు. రవీనా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ సినిమా టీంలోకి వెల్కమ్ చెప్పారు.
Also Read: బాలకృష్ణకు జంటగా మరోసారి నయనతార... ఈసారి హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలో!
View this post on Instagram
సూర్య జంటగా మమితా బైజు...
హీరోగా సూర్య శివకుమార్ 46వ చిత్రమిది. అందుకని, #Suriya46 వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన 'ప్రేమలు', రీసెంట్ బ్లాక్ బస్టర్ 'డ్యూడ్' ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఏఆర్ రెహమాన్ మేనకోడలు - యువ సంగీత దర్శకుడు & హీరో జీవీ ప్రకాష్ కుమార్ సిస్టర్ భవానీ శ్రీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అన్నట్టు.. ఈ సినిమాకు జీవీ సంగీత దర్శకుడు.
Also Read: చిరంజీవి - బాబీ కొల్లి సినిమాలో తమిళ్ హీరో... సేమ్ ఫార్ములా రిపీట్?
తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సూర్య - వెంకీ అట్లూరి సినిమా విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'లక్కీ భాస్కర్' విజయం తర్వాత వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం, పైగా సూర్య హీరో కావడంతో ఈ మూవీకి క్రేజ్ నెలకొంది.





















