Sudheer Babu's Jatadhara Teaser Released: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'జటాధర' టీజర్ వచ్చేసింది. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపెడుతూ విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్న టీజర్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టీజర్‌ను రిలీజ్ చేశారు.

పవర్ ఫుల్ లుక్‌లో సోనాక్షి

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషిస్తుండగా... టీజర్‌లో ఆమె లుక్ భయపెట్టిస్తోంది. ఓ పాడుబడిన కోటలో నిధిని చూపిస్తూనే... ఆ నిధికి కాపలాగా పవర్ ఫుల్ రోల్‌లో ఆమె కనిపించనున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. శివుడే నేలకు దిగి వచ్చాడా అన్నట్లుగా చేతిలో త్రిశూలంతో ఆ కోటలోకి సుధీర్ బాబు ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దీంతో పాటే ఇరువురి మధ్య యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవల్. దురాశకు, త్యాగానికి మధ్య జరిగే పోరాటాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలంటూ మూవీ టీం పేర్కొంది.

Also Read: డిఫరెంట్ రోల్... డిఫరెంట్ లుక్... 'ప్యారడైజ్'లో నేచరల్ స్టార్ నాని పేరు కూడా...

ఆమె రోల్ ఏంటి?

ఈ మూవీలో సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్ భయపెట్టేదిగా ఉండగా... ఇప్పుడు టీజర్‌లోనూ అంతే స్థాయిలో భయపెట్టారు. సినిమాలో అసలు ఆమె రోల్ ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎలివేషన్స్ చూస్తుంటే ఉగ్రరూపంలో కనిపిస్తుండగా... నిధి ఉన్న కోటకు ఆమె కాపలాగా ఉన్నట్లు అర్థమవుతోంది. 'ఆమె దురాశ సృష్టించిన చీకటి' అంటూ పేర్కొనగా... నిధి కోసం వచ్చిన వారిని సంహారం చేస్తున్నట్లుగా ఉంది. మరోవైపు సుధీర్ బాబు ఎలివేషన్స్ సైతం అదిరిపోయాయి. టీజర్‌లో త్రిశూలంతో ఆయన ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఓ కామన్ మ్యాన్ ఆమెతో ఎందుకు తలపడాల్సి వచ్చిందో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఈ మూవీకి వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తుండగా... సుధీర్ బాబు, సోనాక్షి సిన్హాలతో పాటు రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేశంలో ఓ ప్రముఖ ఆలయం కథాంశంతో మైథలాజికల్ థ్రిల్లర్‌గా మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. జీ స్టూడియోస్ సమర్పణలో కే.ఆర్.బన్సల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు.

ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు సుధీర్ బాబు. ప్రేమకథ, హరోంహర వంటి మాస్ ఎలివేషన్స్ చూపించగా... ఆ రోల్స్ అన్నింటికీ డిఫరెంట్‌గా ఈ రోల్ ఉండనుంది. శాస్త్రీయం, పౌరాణిక అంశాల మేళవింపుతో మైథలాజికల్ థ్రిల్లర్‌గా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. సుధీర్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో మూవీ తెరకెక్కుతోంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు మేకర్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. త్వరలోనే తెలుగుతో పాటు హిందీ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.