Sudheer Babu Comments on Mahesh babu and Anil Ravipudi: ఫలితాలత్ సంబంధం లేకుండా హీరో సుధీర్‌ బాబు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. ఏడాది ఒక్క సినిమా అయినా రిలీజ్‌ చేస్తూ కెరీర్‌ని బిజీగా చేసుకుంటున్నాడు. ఇక మొదట్లో ప్రేమకథలతో వచ్చిన సుధీర్‌ బాబు ఇప్పుడు పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలు, డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో వస్తున్నాడు. ఈసారి 'హరోం హర' అంటూ తనలోని యాక్షన్‌ చూపించబోతున్నాడు. జ్ఞానసాగ‌ర్ ద్వార‌క దర్శకత్వంలో పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


నాకే మహేష్ సలహాలు ఇస్తుంటాడు


ఈ క్రమంలో నేడు మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా నేడు 'హరోం హర' ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్స్‌ అనిల్‌ రావిపూడి, సంపత్‌ నందిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ.. తన మామయ్య కృష్ణ జయంతి సందర్భంగా హరోం హర మూవీ ట్రైలర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉందన్నాడు. ఆ తర్వాత తన బావ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గురించి మాట్లాడారు. "నాకు, మహేష్‌ మధ్య ఇంటారాక్షన్‌ ఎలా ఉంటుందంటే.. ఒకరి ఒకరం సజెషన్స్‌ లాంటివి పెద్దగా ఏం ఇచ్చుకోం. కానీ మహేషే నాకు సలహాలు ఇస్తాడు. నేను పెద్దగా ఏం ఇవ్వను. తనే నాకు సినిమాల విషయంలో సజెషన్స్‌ ఇస్తుంటాడు. నేను మాత్రం ఫిట్‌నెస్‌, డైట్‌ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటా.


ఇలాంటి సినిమాలు మళ్లీ చెయ్ అన్నాను


అయితే మహేష్‌-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా చూసి మహేష్‌తో ఒక్క మాట చెప్పాను. ఈ సినిమా బాగుతుంది. ఇలాంటి సినిమాలే ఇంకో రెండు మూడు చెయ్‌ అని చెప్పా" అంటూ సుధీర్‌ బాబు పక్కనే ఉన్న అనిల్‌ రావిపూడిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. సుధీర్ బాబు కామెంట్స్‌ విన్న అనిల్‌ రావిపూడి వెంటనే ఆయన దగ్గరికి వచ్చి నవ్వుతూ మైక్‌లో ఏదో చెప్పి వెళ్లిపోయారు. దీంతో మెసేజ్‌ ఉంది కావాలంటే చూపిస్తా చూడు అంటూ సుధీర్‌ బాబు నవ్వుతూ అన్నాడు. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని సీన్స్ మీరు హ్యాండిల్‌ చేసిన విధానం తనకు చాలా బాగా నచ్చిందంటూ అనిల్‌ రావిపూడిని కొనియాడాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.  


Also Read: బాలీవుడ్‌లో మరో బ్రేకప్‌ - ఐదేళ్ల బంధానికి ముగింపు పలికిన మలైకా, అర్జున్‌..!


కాగా అనిల్‌ రావిపూడి-మహేష్‌ బాబు కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ ఎంతటి విజయం సాధించింతో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 2020లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. కరోనా టైంలోనూ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మాత్రమే ఆడియో కూడా మంచి విజయం సాధించింది. జనవరి 11, 2020న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో పండగ వాతావరణం కనిపించింది. అప్పటికే ఎఫ్‌ 2తో హిట్‌ కొట్టిన అనిల్‌ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు'తో స్టార్‌ డైరెక్టర్స్‌ జాబితాలో చేరిపోయారు. ఈ దెబ్బతో ఇండస్ట్రీలో ఆయన పేరు మోరుమోగింది.