Jayakrishna's Srinivasa Mangapuram Glimpse Review : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన థర్డ్ జనరేషన్ యంగ్ హీరో జయకృష్ణ ఫస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ సినిమా RX100, మంగళవారం మూవీస్ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా... మూవీ గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేశారు.

Continues below advertisement

గ్లింప్స్ ఎలా ఉందంటే?

తాతకు తగ్గ మనవడిగా... బాబాయ్‌కు తగ్గ అబ్బాయ్‌గా జయకృష్ణ యాక్షన్ వేరే లెవల్‌లో ఉంది. 'నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను. కానీ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం...' అంటూ జయకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్‌తో స్టార్ట్ అయిన గ్లింప్స్... యాక్షన్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అందుకు తగ్గట్లుగానే వయలెన్స్ కూడా ఉంది. క్లైమాక్స్‌లో తాత కృష్ణ దీవిస్తుంటే... మనవడు నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఫ్రేమ్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.

Continues below advertisement

Also Read : 29 Movie OTT : ఓటీటీలోకి రీసెంట్ తమిళ రొమాంటిక్ డ్రామా - ఐఎండీబీలో 9.1 రేటింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్‌గా చేస్తుండగా... తెలుగులో ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా... మోహన్ బాబు, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ హైప్ క్రియేట్ చేస్తుండగా... లేటెస్ట్ గ్లింప్స్ అంచనాలు అమాంతం పెంచేసింది.

లెజెండరీ నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో, జెమినీ కిరణ్ తన 'చందమామ కథలు' బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. వరల్డ్ వైడ్ జులై 9న మూవీ రిలీజ్ కానుంది.

Also Read : Save The Tigers 3 OTT : సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.