'పుష్ప 2: ది రూల్' సినిమాలోని స్పెషల్ సాంగ్ 'కిస్సిక్...'తో యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల (Sreeleela) మరోసారి సర్రున లైమ్ లైట్‌లోకి దూసుకు వచ్చింది. ప్రజెంట్ ఆవిడ చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా వచ్చింది. అదీ అఖిల్ అక్కినేని (Akhil Akkineni) సినిమా అని టాక్. 


అఖిల్ జంటగా శ్రీ లీల... దర్శకుడు ఎవరంటే?
Sreeleela set to star opposite Akhil Akkineni: అక్కినేని వారసుడు, కింగ్ నాగార్జున రెండో కుమారుడు అఖిల్ సినిమా చేసి చాలా రోజులైంది. ఆయన గ్యాప్ తీసుకుని మేకోవర్ మీద దృష్టి పెట్టారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన 'ఏజెంట్' తర్వాత అఖిల్ మరో సినిమా ఓకే చేయలేదు. అగ్ర దర్శకుల నుంచి యువ దర్శకుల వరకు పలువురి కథలు విన్నారు. చివరకు 'వినరో భాగ్యము విష్ణు కథ' దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుతో సినిమా చేయడానికి ఓకే అన్నారు. 


అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించే సినిమాలో కథానాయికగా శ్రీ లీలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాను అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలో సినిమా గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. అఖిల్ పెళ్లి తర్వాత సినిమా స్టార్ట్ కావచ్చు. ఇటీవల ఆయన ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. 






అఖిల్ కంటే ముందు నాగచైతన్య సినిమాలో...
అఖిల్ అక్కినేనితో సినిమా కంటే ముందు అఖిల్ అన్నయ్య నాగ చైతన్యతో శ్రీ లీల సినిమా చేయనున్నారు. 'విరూపాక్ష'తో రూ. 100 కోట్ల కలెక్షన్లు సాధించిన దర్శకులు జాబితాలో చేరిన కార్తీక్ వర్మ దండు. ఆయన దర్శకత్వంలో నాగ చైతన్య ఒక సినిమా చేయనున్నారు. అందులోనూ శ్రీ లీల కథానాయిక. అక్కినేని అన్నదమ్ములతో ఆవిడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు.


Also Read50 షోలు వేస్తే 5000 టికెట్లు కూడా తెగలేదు... సిద్ధూను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ అరెస్ట్


ప్రస్తుతం శ్రీ లీల చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో యూత్ స్టార్ నితిన్ సరసన నటించిన 'రాబిన్ హుడ్' కంప్లీట్ అయింది. తొలుత డిసెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేసినా... ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతికి వెళ్ళింది. అది కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో కూడా ఆవిడ నటిస్తోంది. 'ధమాకా' విజయం తర్వాత మాస్ మహారాజ రవితేజకు జోడీగా మరోసారి నటిస్తున్నారు. ఆ సినిమా 'మాస్ జాతర'. సితార సంస్థలో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రూపొందే సినిమాలోనూ ఆవిడ హీరోయిన్.


Also Readమిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?