టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల 'పుష్ప 2'లో స్పెషల్ సాంగ్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 'కిస్సిక్' అంటూ హాట్ డ్యాన్స్ తో అదరగొట్టింది. అయితే తాజాగా శ్రీలీల, బాలీవుడ్ స్టార్ కిడ్ ఇబ్రహీం అలీ ఖాన్ మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీలీల సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన ఆ చిన్న పాప వీడియోకు సంబంధించి ఇబ్రహీం కామెంట్ చేయడం, దానికి శ్రీలీల ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.
ఇటీవల శ్రీలీల తన వానిటీ వ్యాన్ లో ఒక చిన్న అభిమానితో కలిసి క్యూట్ వీడియోను పంచుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఒక చిన్న పాప తనను చూడడానికి వచ్చింది అని చెబుతూ, తన మీద కూర్చోబెట్టుకుని సరదాగా ముచ్చట్లు పెట్టారు. అంతే కాకుండా ఆ పాపను తెగ ముద్దు చేసింది. క్యూట్ గా ఉందంటూ ముద్దులతో ఆ పాపను ముంచెత్తింది. వీడియోలో ఆ చిన్నారిని శ్రీలీల ఒడిలో కూర్చోబెట్టుకొని, 'పుష్ప 2: ది రూల్'లోని 'కిస్సిక్' పాటను పాడుతూ కనిపించింది. ఆ వీడియోకు 'కిస్సిక్ ముద్దులు క్యూటీ కిడ్డీ... వానిటీ విజిటర్..." అంటూ రాసుకొచ్చింది. ఇక వీడియోలో ఆ చిన్నారితో పాటు మరో అమ్మాయి కూడా వారితో కలిసి 'కిస్సిక్' హుక్ స్టెప్ వేస్తూ కనిపించింది. తర్వాత శ్రీలీల ఆ చిన్నారిని గట్టిగా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది. ఆమె ఆ చిన్న పాప నుదిటిపై, బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించింది. నిజానికి ఆ వీడియో చూడడానికి చాలా క్యూట్ గా ఉంది.
కానీ ఆ క్యూట్ వీడియోపై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ 'ఆ అమ్మాయిని ఎందుకు అంతలా వేధించావు' అంటూ కామెంట్ చేయడం వివాదానికి దారి తీసింది. ఇబ్రహీంకు 'ఆ పాప క్యూట్'గా ఉంది అంటూ సమాధానం ఇచ్చింది శ్రీలీల. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ డిస్కషన్, శ్రీలీల ఆప్యాయతతో ఆ చిన్న పాపను దగ్గరకు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: ఒకవైపు నాగ చైతన్య పెళ్లి... మరోవైపు సమంత పార్టీ... చైతూ పెళ్లి రోజు సామ్ అలా చేసిందా?
ఇదిలా ఉండగా ఇబ్రహీం అలీ ఖాన్ త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కలిసి 'సర్జమీన్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి శ్రీలీల తన నెక్స్ట్ మూవీ 'డైలర్'తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజాగా ఇబ్రహీం, శ్రీలల మధ్య నడిచిన ఈ ఫన్నీ డిస్కషన్ ను చూశాక ఆ వార్తలు నిజమే అన్పిస్తోంది.
ఇక శ్రీలీల ఇటీవలే 'పుష్ప 2: ది రూల్'లో అల్లు అర్జున్‌తో కలిసి 'కిస్సిక్' డ్యాన్స్ నంబర్‌లో తన అదిరిపోయే డ్యాన్సింగ్ స్కిల్స్ తో దుమ్మురేపింది. ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజున రూ. 294 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది 'పుష్ప 2'.
Also Read: రెండో రోజూ అల్లు అర్జున్ జోరు... బాక్సాఫీస్ బరిలో 400 కోట్లు దాటేసిన 'పుష్ప 2', టోటల్ ఎంతో తెలుసా?