Swag Teaser Out: వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తున్న యంగ్‌ హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. శ్రీవిష్ణు సినిమా అంటేనే అందులో ఏదోక కొత్త పాయింట్‌, వైవిధ్యం ఉంటుంది. డిఫరెంట్‌ కంటెంట్‌తో వచ్చిన హిట్స్‌ అందుకుంటున్నాడు. 'సామజవరగమన', 'ఓం భీం బుష్‌' వంటి చిత్రాలతో వరుసగా సూపర్‌ హిట్స్‌  అందుకున్న శ్రీ విష్ణు మంచి స్పీడ్‌ మీద ఉన్నాడు. అదే జోష్‌ ఈసారి మరో సరికొత్త సినిమాతో ఫ్యాన్స్‌కి అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇక శ్రీవిష్ణు సినిమాలకు విచిత్రమైన టైటిల్స్ ఉంటాయి. అలా ఈసారి స్వాగ్‌ అంటూ తన దూకూడు చూపించబోతున్నాడు. హసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్‌ మీడియాలో ఫ్యాక్టరి బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం. సైలెంట్‌గా టీజర్‌ రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. టీజర్‌ చూస్తుంటే శ్రీవిష్ణు స్వాగ్‌తో వన్‌ మ్యాన్‌ షో చూపించబోతున్నాడనిపిస్తుంది. ఒకటి కాదు రెండు ఏకంగా నాలుగు షేడ్స్‌లో కనిపించబోతున్నాడు ఈ టాలెంటెడ్‌ హీరో. భూత, వర్తమానం, భవిష్యత్తు డిఫరెంట్‌ పాత్రల్లో శ్రీవిష్ణు కనిపించాడు. ఇక ఇందులో పెళ్లి చూపులు ఫేం రితూ వర్మ హీరోయిన్‌ కాగా సీనియర్‌ నటి మీరా జాస్మిన్‌, సునీల్‌, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, రవిబాబు, గెటప్ శ్రీను వంటి తదితర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్‌లో ఈ పాత్రలన్నింటికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో శ్రీవిష్ణు పురుష అహంకారం ఉండే వ్యక్తిగా కనిపించబోతుండగా.. పురుషాధికారాన్ని ప్రశ్నించే అమ్మాయిగా రితూ వర్మ కనిపించబోతుంది. 



టీజర్‌ విషయానికి వస్తే..


టీజర్‌ మొదట్లో పురుష జాతిని తొక్కేసిన ఓ రాజవంశంతో మొదలైంది. ఇందులో రితూ వర్మ మహారాణీగా కనిపించింది. మీరా జాస్మీన్‌ కూడా రాణిలా పాత్రలో కనిపించింది. అనేక శతాబ్దాల క్రితం పురుషుల ఉనికి ప్రమాదంలో ఉన్న కాలంలో విన్జమారా వంశానికి చెందిన రుక్మిణీ దేవి అనే రాణి పురుషులపై ద్వేషాన్ని పెంచుకుంటుంది. వారిని హీనంగా చూస్తుంటుంది. ఎంతలా అంటే తనకు పుట్టిన మగ బిడ్డను కూడా చంపుకునేంత ద్వేషంతో ఉంటుంది. తనకు పుట్టిన ఏడుగురు మగబిడ్డలను చంపిన ఆ వంశానికి ఓ శాపానికి గురవుతుంది. దాంతో పరిస్థితులు మారి పురుషులు మహిళలను శాసించే పరిస్థితికి వస్తుంది.


అలా టీజర్‌ మొత్తం పునర్జన్మలా నేపథ్యంలో సాగింది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వివిధ జన్మల్లోనూ పురుషాంకారం చూపించే పురుషుడిగా కనిపించాడు శ్రీవిష్ణు. టీజర్‌ పునర్జన్మల నేపథ్యంలో సాగుతూ ఆధునిక పాత్రలు, పోరాటాలను కూడా చూపించడం ఆసక్తిని కలిగిస్తోంది. నాలుగు విభిన్న గెటప్పుల్లో కనిపించిన ప్రతి పాత్ర తనదైన ప్రత్యేకతను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భూత, భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో శ్రీవిష్ణు విభిన్న పాత్రల్లో కనిపించాడు. పురుషాహంకారంతో నిండిన శ్రీవిష్ణు సవాలు చేసే పాత్రలో రితూ వర్మ కనిపించింది.


ఆడపిల్ల అంటే ఆ..డ ఉండాలి కదరా.. ఇది ఇక్కడ ఎందుకు ఉంది ముసలి పాత్రలో ఉన్న శ్రివిష్ణు రితూ వర్మ కించపరినట్టు మాట్లాడతాడు. ఆ తర్వాత రితూ వర్మ వైఫ్‌ ఆప్‌, డాటర్‌ ఆఫ్‌ అంటూ ఆడవాళ్లు మగవాళ్లనే లింక్‌ చేసుకోవాలా? మనకంటూ ఒక గుర్తింపు లేదా? అని ప్రశ్నిస్తుంది. ఇలా టీజర్‌ మొత్తం వివిధ షేడ్స్‌లో శ్రీవిష్ణు తన పురుషాంహకారంతో అల్లాడించారు. కామెడీ, ఎంటర్‌టైనర్‌తో పాటు సీరియస్‌ పాయింట్‌తో సాగిన స్వాగ్ టీజర్‌ మూవీపై అంచనాలు పెంచేస్తోంది.