Sree Vishnu Reaction On Vishnu Vinyasam Release Dates : గతేడాది '#సింగిల్' మూవీతో మంచి హిట్ కొట్టిన యంగ్ హీరో శ్రీవిష్ణు ఈసారి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌ 'మృత్యుంజయ్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ చేయగా... ఒకే రోజు తాను నటించిన రెండు మూవీస్ రిలీజ్ అవుతాయనే ప్రచారంపై శ్రీవిష్ణు స్పందించారు.

ఇదే ఫస్ట్ టైం

తాను నటించిన మృత్యుంజయ్, విష్ణు విన్యాసం రెండు మూవీస్ కూడా ఒకే రోజు విడుదలకు పోటీగా ఉండడంపై శ్రీవిష్ణు రియాక్ట్ అయ్యారు. 'నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. మృత్యుంజయ్ ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. అయితే, 'విష్ణు విన్యాసం' మూవీ రిలీజ్ గురించి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. రెండూ ఒకే రోజు వస్తాయనేది చెప్పలేం.' అని అన్నారు. 

Also Read : మహాకుంభమేళా మోనాలిసాకు మరీ అంత తక్కువా... 'మణిపూర్ డైరీస్'కు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కంప్లీట్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్'

'మృత్యుంజయ్' కంప్లీట్ థ్రిల్లర్‌గా నడుస్తుందని చెప్పారు శ్రీవిష్ణు. 'సాంగ్స్, హీరోయిన్స్, కామెడీ లేకుండా హానెస్ట్ థ్రిల్లర్స్ మన తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి. హుస్సేన్ ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి కంటెంట్‌ను తెలుగు వారికి అందించాలనే ఉద్దేశంతో సందీప్ ఈ మూవీని నిర్మించారు.

ఇలాంటి కథలు చెప్పినప్పుడు ఒకలా.. చేసేటప్పుడు ఇంకోలా.. ఆర్ఆర్ అయిన తరువాత చూసుకుంటే మరోలా ఉంటుంది.  కాళ భైరవ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. చాలా తక్కువ పాత్రలతో ఈ సినిమా నడుస్తుంది. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో నా పెర్ఫార్మెన్స్ కూడా కొత్తగా ఉంటుంది. ట్రైలర్ తర్వాత కథ మరింత అర్థం అవుతుంది.' అని అన్నారు.

'సామజవరగమన' తర్వాత

'సామజవరగమన' మూవీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మృత్యుంజయ్. ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌కు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. ర‌మ్య గున్నం స‌మ‌ర్ప‌ణ‌లో లైట్‌ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు కథే హీరో అని... సెటిల్డ్‌గా నటించే హీరో కావాలనే శ్రీవిష్ణును అనుకున్నట్లు చెప్పారు డైరెక్టర్ హుస్సేన్ షా. విలన్ రోల్ కూడా చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందన్నారు. శ్రీవిష్ణు కెరీర్ బిగినింగ్ నుంచీ కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారని... ఆయన ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేయలేదని చెప్పారు నిర్మాత సందీప్ గున్నం. 'మృత్యుంజయ్' అందరినీ ఆకట్టుకుంటుంద్నారు. 

'మృత్యుంజయ్' టెక్నికల్ టీం - బ్యానర్స్: లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్, నిర్మాతలు: సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి, సమర్పణ: రమ్య గున్నం, దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్, సంగీతం: కాళ భైరవ, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, డీఓపీ : విద్యాసాగర్.