Tom Holland's Spider Man Indian Box Office First Weekend Collections : రీసెంట్ సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే' ఫస్ట్ వీకెండ్ ఇటు ఇండియాతో పాటు అటు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. రిలీజ్ కాక ముందే ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మూవీ... ఇప్పుడు కలెక్షన్స్ పరంగా మరో రికార్డు క్రియేట్ చేసింది.

Continues below advertisement

రికార్డ్ బ్రేకింగ్ వీకెండ్

జులై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'స్పైడర్ మ్యాన్' ఫస్ట్ వీకెండ్ ఇండియావ్యాప్తంగా రూ.310 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అటు, గ్లోబల్ స్థాయిలో తొలి వారం 927 మిలియన్ డాలర్లకు  పైగా వసూళ్లు సాధించినట్లు మూవీ టీం అధికారికంగా వెల్లడించింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.8,830 కోట్లు.

Continues below advertisement

ఈ నెంబర్స్‌తో ప్రపంచ సినిమా చరిత్రలోనే రెండో అతి పెద్ద గ్లోబల్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు రూ.2,100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'స్పైడర్ మ్యాన్' ఫస్ట్ వీకెండ్‍‌లోనే బడ్జెట్‌ను అధిగమించి భారీ విజయాన్ని అందుకుంది. 2019లో వచ్చిన 'అవెంజర్స్: ది ఎండ్‌గేమ్' రూ.11 వేల కోట్లతో ఎక్కువ ఓపెనింగ్స్ సాధించి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

Also Read : Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!

మార్వెల్  సినిమాటిక్ యూనివర్స్‌లో 38వ చిత్రంగా ఈ సినిమా రూపొందించారు. ఇండియాలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా 'అవతార్ : ది వే ఆఫ్ వాటర్' (2022) నిలిచింది. దాదాపు రూ.390 కోట్లు సాధించగా... స్పైడర్ మ్యాన్ నెక్స్ట్ వీక్‌లో ఆ రికార్డు బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా  వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ స్పైడర్ మ్యాన్‌కు సూపర్ క్రేజ్ ఉంది. అంతే  స్థాయిలో కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది.

టామ్ హాలండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించగా... డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. రాబోయే రోజుల్లో సరికొత్త రికార్డులు ఖాయమంటూ సినీ విశ్లేషకుల అంచనా.

Also Read : Irumudi Yaalalo Yaalalo Song : ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.