అన్వేషించండి

Nilave Movie : మా 'నిలవే' మాకు బాహుబలి - ఫస్ట్ మూవీతోనే హిట్ ఇచ్చారు - సక్సెస్ సెలబ్రేషన్స్‌ హైలెట్స్

Nilave Movie Reaction : 'నిలవే' తమకు బాహుబలి సినిమా లాంటిదని హీరో సౌమిత్ పోలాడి అన్నారు. తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మూవీ టీం పాల్గొంది.

Sowmith Poladi Reaction About Nilave Movie : సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా 'నిలవే' ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌమిత్ హీరోగా నటిస్తూనే సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోస్‌లో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరో హీరోయిన్లో పాటు డైరెక్టర్స్, మూవీ టీం పాల్గొంది. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఈ మూవీ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని వీడియో బైట్ ద్వారా తెలిపారు.

'నిలవే' మాకు 'బాహుబలి' 

మూడేళ్ల కష్టమే 'నిలవే' సినిమా అని అన్నారు హీరో సౌమిత్ పోలాడి. 'కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి 'బాహుబలి'ని ఆడియెన్స్ ముందుకు తీసుకు రావడానికి మూడేళ్లు పట్టింది. మా 'నిలవే' మాకు 'బాహుబలి' లాంటిది. ఈ జర్నీలో మాకెన్ని ఇబ్బందులొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. జెన్యూన్‌ హిట్‌గా మా చిత్రం నిలిచింది. నాలుగు రోజులుగా ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్స్‌ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం.' అని అన్నారు. తనకు తెలుగు ఆడియన్స్ ఫస్ట్ మూవీతోనే బిగ్ సక్సెస్ ఇచ్చారని అన్నారు హీరోయిన్ శ్రేయాసి సేన్.

సైలెంట్ హిట్

వాలెంటైన్స్ డేకు రిలీజ్ అయిన చిత్రాల్లో 'నిలవే' సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుందని చెప్పారు డైరెక్టర్ వి సముద్ర. 'నిలవే డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు. డైరెక్టర్ సాయి కే వెన్నంతో పాటు టీమ్ అందరికీ నా శుభాభినందనలు.' అని అన్నారు. 

చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూశాననే ఫీలింగ్ మనసుకు కలిగిందని జెమినీ సురేష్ తెలిపారు. 'బాపు గారు గీసిన బొమ్మలా, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలా, నేటి జనరేషన్‌ ‘గీతాంజలి’లా ‘నిలవే’ చిత్రం నిలుస్తుంది. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన  రాజ్ అల్లాడ గారికి థ్యాంక్స్. డైరెక్టర్ సాయి విజన్,  దిలీప్ విజువల్స్‌, కళ్యాణ్ మ్యూజిక్ అద్భుతంగా కుదిరాయి. మా కరీంనగర్ కుర్రాడు సౌమిత్ ఈ సినిమాతో హిట్ కొట్టాడు.' అని అన్నారు.

Also Read : ఎన్టీఆర్ నీల్ మూవీ 'డ్రాగన్' కాదా? - ఈ టైటిల్ ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేసుండరు... అందులో నిజమెంత?

టీం సపోర్ట్‌తోనే...

మూడేళ్ల క్రితం మొదలైన జర్నీ ఇక్కడివరకూ వచ్చిందని అన్నారు డైరెక్టర్ సాయి కే వెన్నం. 'మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఈ మూవీ మేకింగ్‌లో చాలా విషయాలు నేర్చుకున్నా. మన ఇంటెన్షన్ ప్యూర్‌‌గా ఉంటే అన్నీ నెరవేరుతాయి అనేది ఈ చిత్రంతో తెలుసుకున్నా. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్‌కు చెప్పగలను. మా కారణం గట్టిగా ఉంది కాబట్టే ఇక్కడవరకు వచ్చాం.' అని అన్నారు. ఆడియన్స్ ఇచ్చిన సక్సెస్ చాలా హ్యాపీగా ఉందన్నారు మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ్ నాయక్. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్నారు.

'నిలవే' నటీనటులు : సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత ఇతరులు.

టెక్నికల్ టీమ్ : బ్యానర్ - POV ఆర్ట్స్  ప్రొడక్షన్స్, నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి  కే వెన్నం, దర్శకత్వం -  సౌమిత్  పోలాడి, సాయి కే వెన్నం, సహ - నిర్మాతలు : వెంకట్ కొణకండ్ల, సంజనా కృష్ణ, తాహెర్ సినీ టెక్, సంగీతం: కళ్యాణ్ నాయక్, సినిమాటోగ్రఫీ :  దిలీప్ కే కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అన్వేష్ పెరటి, అజయ్ కుమార్ పుప్పల, లైన్ ప్రొడ్యూసర్లు: సునందా ఐథాని, సుష్రిత్ దేవి,
పాటలు: ఎమ్‌వి.ఎస్. భరద్వాజ్, అడిషనల్ లిరిక్స్ - కోటి, ప్రొడక్షన్ డిజైనర్స్ -  కట్టి శివరామ కృష్ణ, జియా ఘోష్, అడిషనల్ ప్రొడక్షన్ డిజైనర్ - నూరా సయ్యద్, ఎడిటర్ - సత్య.జి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Toxic First Single : టాక్సిక్ 'తబాహీ' సాంగ్ రిలీజ్ - రొమాంటిక్ ట్రాక్ లిరిక్స్...
టాక్సిక్ 'తబాహీ' సాంగ్ రిలీజ్ - రొమాంటిక్ ట్రాక్ లిరిక్స్...
Bhartha Mahasayulaku Wignyapthi OTT : ఎట్టకేలకు ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' - రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఎట్టకేలకు ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' - రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
Manjummel Boys Chidambaram : 'మంజుమ్మల్ బాయ్స్' డైరెక్టర్ చిదంబరంపై లైంగిక ఆరోపణలు - మహిళ కంప్లైంట్‌తో కేసు
'మంజుమ్మల్ బాయ్స్' డైరెక్టర్ చిదంబరంపై లైంగిక ఆరోపణలు - మహిళ కంప్లైంట్‌తో కేసు
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
Ajith Kumar Madhavan : దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Suriya Venkya Atluri : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
Embed widget