Sree Vishnu's Single First Day Box Office Collections: శ్రీ విష్ణు లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సింగిల్' మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.4.15 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 

రెండో రోజు అదే జోష్

రెండో రోజు కూడా అదే జోష్ కొనసాగిస్తోంది. వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారు. టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో కేవలం 24 గంటల్లోనే 50.71K టికెట్లు బుక్ అయినట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ 'సింగిల్' అదే జోరు కొనసాగిస్తోంది. యూఎస్ మార్కెట్‌లో ఫస్ట్ డే 1.50 లక్షల డాలర్ల గ్రాస్ అందుకున్నట్లు తెలిపిన మూవీ టీం ఆనందం వ్యక్తం చేసింది.

Also Read: లండన్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం లాంఛ్ - ఫ్యాన్స్ జోష్ మామూలుగా లేదుగా..

'సింగిల్' మూవీకి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా.. శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించారు. గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మూవీలో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. వెన్నెల కిశోర్‌తో కలిసి పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. 

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'సింగిల్' మూవీకి సీక్వెల్ కూడా రానుంది. ఈ మేరకు మూవీ క్లైమాక్స్‌లోనే హింట్ కూడా ఇచ్చారు. మరి ఆ స్టోరీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

మూవీ టీం గొప్ప మనసు

'సింగిల్' సినిమా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత భాగం సైనికులకు ఇవ్వనున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు. 'భారత్ మాతా కీ జై! మా సపోర్ట్ ఎప్పుడు మన సైనికులకే! సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని సరిహద్దుల్లో దేశ సంరక్షణ కోసం పోరాటం చేస్తున్న మన సైనికులకు అందించనున్నాం'. అని చెప్పారు. సినిమా హిట్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.