Singer Mangli Reaction On Micro Finance Scam Allegations : ప్రముఖ సింగర్ మంగ్లీ పేరుతో కోట్లలో మైక్రో ఫైనాన్స్ మోసం జరిగిందంటూ గత రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. కొందరు మంగ్లీ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపించి రూ.కోట్లలో వసూలు చేశారని సమాచారం. మంగ్లీ తమ్ముడిపై కూడా ఆరోపణలు వచ్చాయని తెలుస్తోంది. ఈ వార్తలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తనకు అలాంటి వ్యాపారాలతో సంబంధం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
'ఎలాంటి సంబంధం లేదు'
మైక్రో ఫైనాన్స్ పేరిట తన పేరుతో కొందరు డబ్బులు వసూలు చేశారని వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు మంగ్లీ. 'నాకు ఆ వ్యక్తులకు, వాళ్లకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం ప్రతీ రోజూ నన్ను, నా తమ్ముడిని ప్రతీ రోజూ చాలా మంచి అప్రోచ్ అవుతుంటారు.
ఆ ఈవెంట్‌కు సంబంధించి ఇన్విటేషన్ వివరాల వరకే తప్ప... వాళ్ల పర్సనల్ వ్యాపారాల గురించి నాకు, నా ఫ్యామిలీ మెంబర్స్‌కు ఏమాత్రం సంబంధం లేని విషయం. ఇలాంటి మోసపూరిత విషయాల్లో నా పేరును వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయం.' అంటూ రాసుకొచ్చారు.
Also Read : ఓటీటీలోకి సుహాస్ కామెడీ ఎంటర్టైనర్ హే బల్వంత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు'
కొందరు కావాలనే తన వ్యక్తిగత పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మంగ్లీ. 'సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియోలు, మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ తప్పించి నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మొద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ శాఖను కోరుతున్నా.' అంటూ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
