అన్వేషించండి

SINGA: గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?

SINGA Title Glimpse: టి. గోపీచంద్ హీరోగా వి వెంకట్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమాకు 'సింగ' టైటిల్ ఖరారు చేశారు. గోపీచంద్ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గోపీచంద్ పుట్టినరోజున 'సింగ' సినిమా టైటిల్ ప్రకటించారు.
  • ఫస్ట్ లుక్ గ్లింప్స్‌లో గోపీచంద్ ఆగ్రహంతో కూడిన పాత్రలో కనిపించారు.
  • యాక్షన్, ఎమోషన్ నిండిన పవర్‌ఫుల్ కథతో 'సింగ' రూపుదిద్దుకుంది.

టి. గోపీచంద్ (T Gopichand)కు 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మాంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. జూన్ 12న (శుక్రవారం) గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. అలాగే, ఫస్ట్ లుక్ - టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.

'సింగ'... గోపీచంద్ కొత్త సినిమా టైటిల్
Gopichand 34 Titled Singa: గోపీచంద్ కథానాయకుడిగా ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ (V Venkat)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమాకు 'సింగ' టైటిల్ ఖరారు చేశారు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్‌తో పాటు సినిమాలో హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

పక్షులు చేసే శబ్దాలతో 'సింగ' టైటిల్ గ్లింప్స మొదలైంది. ఆ తర్వాత దట్టమైన అడవి మధ్యలోకి వెళ్లినట్టు చీకటిని చీల్చుకుంటూ... చురకత్తులు లాంటి రెండు కళ్ళను చూపించారు. వేటాడటానికి రెడీగా ఉన్న సింహం కళ్లలా అనిపిస్తాయి. ఆ విజువల్ చూస్తే పాంథర్ గుర్తుకు రావడం గ్యారెంటీ. ఆ తర్వాత గోపీచంద్ ఫేస్ రివీల్ చేశారు. పాంథర్ అనిపిస్తుంది. కళ్లలో ఆగ్రహం, చేతిలో గొడ్డలి, ప్రతీకారంతో రగులుతున్న పాంథర్‌లా గోపీచంద్ ఆకట్టుకున్నారు. మాస్ ప్రేక్షకులతో పాటు గోపీచంద్ అభిమానులకు నచ్చేలా గ్లింప్స్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Also Read: Anil Ravipudi - GV Prakash Funny Video: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో

యాక్షన్, ఎమోషన్, డ్రామా - అన్ని హంగులు మేళవించిన పవర్ ఫుల్ కథతో 'సింగ' రూపొందుతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. గోపీచంద్‌ను సరికొత్త కోణంలో చూపించేలా వెంకట్ గ్రిప్పింగ్ కథ సిద్ధం చేశారని నిర్మాతలు చెప్పారు. సామ్ సిఎస్ అందించిన నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్ గ్లింప్స్‌కు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

Also ReadSing Geetham Review - 'సింగ్ గీతం' రివ్యూ: ఊరికి శాపం, మాటల బదులు పాటలు... సింగీతం సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by T Gopichand (@yoursgopichand)

Singa Movie Cast And Crew: గోపీచంద్ సరసన మలయాళ భామ అనార్కలి నజర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు షామ్‌దత్ ISC సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జాతీయ పురస్కార గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: వి వెంకట్, నిర్మాతలు: విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి, నిర్మాణ సంస్థ: 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్, సంగీత దర్శకుడు: సామ్ సిఎస్, ప్రొడక్షన్ డిజైన్: రామ కృష్ణ - మోనిక, సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్ - హరిహరన్.

Photo GalleryPandu Master - పండు మాస్టర్‌కు పృథ్వీరాజ్ పరామర్శ... లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏమిటంటే?

Frequently Asked Questions

గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఏమిటి? ఏ సందర్భంలో ప్రకటించారు?

గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ 'సింగ'. జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేశారు.

'సింగ' సినిమాకు దర్శకుడు ఎవరు? ఏ సంస్థ నిర్మిస్తోంది?

'సింగ' సినిమాతో ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు.

'సింగ' చిత్రంలో గోపీచంద్ సరసన కథానాయిక ఎవరు? సంగీత దర్శకుడు ఎవరు?

ఈ చిత్రంలో మలయాళ భామ అనార్కలి నజర్ కథానాయికగా నటిస్తోంది. సంగీత దర్శకుడిగా సామ్ సిఎస్ పనిచేస్తున్నారు.

'సింగ' టైటిల్ గ్లింప్స్‌లో గోపీచంద్ ఎలా కనిపించారు?

గ్లింప్స్‌లో గోపీచంద్ కళ్లలో ఆగ్రహం, చేతిలో గొడ్డలితో, ప్రతీకారంతో రగులుతున్న పాంథర్‌లా ఆకట్టుకున్నారు. ఇది మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh Vs Prakash Raj: దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
Maa Inti Bangaram: వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
Gautam Ghattamaneni: ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget