Salman Khan's Sikindar Movie OTT Release On Netflix: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సికిందర్'. రంజాన్ సందర్భంగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజాగా.. ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix) వేదికగా ఈ నెల 25 నుంచి 'సికిందర్' (Sikindar) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ మూవీని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషించగా.. సత్యరాజ్ నెగిటివ్ రోల్‌లో నటించారు. గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read: మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్న దిల్ రాజు? తెర వెనక కుట్ర జరుగుతోందా? ఏంటీ కొత్త వివాదం??
స్టోరీ ఏంటంటే?
రాజ్‌కోట్ సంస్థాన వారసులు సంజయ్ అలియాస్ సికిందర్ (సల్మాన్ ఖాన్), రాణి సాయిశ్రీ (రష్మిక) అనోన్యంగా ఉంటూ వారి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటుంటారు. అక్కడి ప్రజలందరూ ఆయనను రాజా సాబ్ అంటారు. ఒకరోజు అనుకోని ప్రమాదంలో సాయిశ్రీ మరణిస్తుంది. అయితే, అంతకు ముందే ఆమె తన అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకుని వాగ్దానం తీసుకుంటుంది. అలా ఆమె కళ్లు, గుండె, లంగ్స్ వేరే వేరే వ్యక్తులకు దానం చేస్తారు. మరోవైపు.. సంజయ్ ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఓ మహిళతో మహారాష్ట్ర మంత్రి ప్రధాన్ (సత్యరాజ్) కొడుకు అర్జున్ (ప్రతీక్ బబ్బర్) తప్పుగా ప్రవర్తిస్తే చిత్తు చిత్తుగా కొడతాడు. అది తెలిసి తన కొడుకును కొట్టిన వ్యక్తి అంతు చూడమని ప్రకాష్‌ను పంపిస్తాడు మంత్రి.
సంజయ్ ఇంటికి వచ్చిన ప్రకాష్ కార్ (పోలీస్ వెహికల్) టైర్లు, అద్దాలు పీకేసి పార్టులుగా విడదీస్తారు. ఆ ప్రాంత ప్రజల్లో సంజయ్ పట్ల అభిమానం చూశాక అక్కడ ఏమీ చేయలేమని ఓ ప్లాన్ వేస్తారు. తీవ్రవాద దాడిలో ఇరికించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏం జరిగింది? సంజయ్ భార్య రాణీ సాహీబా - సాయిశ్రీ (రష్మిక) ఆర్గాన్స్ ముంబైలో ముగ్గురు వ్యక్తులకు (వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు) ఎందుకు డొనేట్ చేశారు? సాయిశ్రీ మరణానికి కారణం ఏమిటి? ఆర్గాన్స్ పొందిన వ్యక్తులకు మంత్రి వల్ల వచ్చిన కష్టం ఏంటి? మంత్రి నుంచి వారిని సికిందర్ ఎలా కాపాడాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇదే ఓటీటీలోకి..
మరోవైపు.. ఇదే ఓటీటీలోకి నేచురల్ స్టార్ నాని రీసెంట్ బ్లాక్ బస్టర్ 'హిట్ 3' కూడా రానుంది. ఈ నెల 29 నుంచి మూవీ అందుబాటులోకి రానుంది సంస్థ ప్రకటించింది. ఈ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా.. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు.