Siddu Jonnalagadda New Movie Update: స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తన కెరీర్‌లో 10వ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 'డీజే టిల్లు'(DJ Tillu), 'టిల్లు స్క్వేర్'(Tillu Square) సినిమాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు.. తన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సిద్ధు10 (Siddu 10) అని వర్కింగ్ టైటిల్‌తో పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈసారి ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో సినిమా చేయబోతున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌లో ఇది 10వ సినిమా. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మింస్తున్నారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు బుచ్చిబాబు సానా స్క్రిప్ట్‌ను అందించగా, అల్లు అరవింద్ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. మోహన్.బి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం కానున్నారు.
గ్రాండ్‌గా పూజా కార్యక్రమం
ఈ సినిమాకు నవంబర్ 11న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాం జరిగింది. ఇక డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త కథ, కొత్త దర్శకుడు కావడంతో సినిమాపై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. సిద్ధూ జొన్నలగడ్డ సరసన యంగ్ హీరోయిన్ నయన్ సారిక నటించనుంది టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.
