Baahubali The Epic: 'బాహుబలి 3'పై మేకర్స్ క్లారిటీ - 'బాహుబలి: ది ఎపిక్' క్లైమాక్స్‌లో బిగ్ సర్‌ప్రైజ్...
Shobu Yarlagadda: 'బాహుబలి 3'పై అనౌన్స్‌మెంట్ ఉంటుందంటూ వస్తోన్న రూమర్లపై నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చేశారు. 'బాహుబలి: ది ఎపిక్' క్లైమాక్స్‌లో సర్‌ప్రైజ్ ఉంటుందటూ హైప్ క్రియేట్ చేశారు.

Shobu Yarlagadda About Baahubali 3 Rumours: భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ 'బాహుబలి'. ఈ మూవీ రిలీజై దాదాపు పదేళ్లు పూర్తైన సందర్భంగా రెండు పార్టులను కలిపి ఒకే మూవీగా 'బాహుబలి: ది ఎపిక్' రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... ముఖ్యమైన సీన్స్ అన్నింటినీ కలిపి ఒకే మూవీలో చూపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటోంది.
'బాహుబలి 3'పై క్లారిటీ
'బాహుబలి: ది ఎపిక్' క్లైమాక్స్‌లో 'బాహుబలి 3'పై అనౌన్స్‌మెంట్ ఉంటుందంటూ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ హల్చల్ చేశాయి. తాజాగా దీనిపై ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ రియాక్ట్ అయ్యారు. అవన్నీ రూమర్లేనని అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. 'బాహుబలి 3కి సంబంధించి ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉంది. బాహుబలి: ది ఎపిక్‌లో బాహుబలి 3పై ఎలాంటి ప్రస్తావన లేకపోయినా ఓ సర్ ప్రైజ్ ఆశించవచ్చు.' అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే , అదేంటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
కలెక్షన్స్ కోసం కాదు
'రీ రిలీజ్ నుంచి ఎంత కలెక్షన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?' అంటూ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు... కలెక్షన్ల కోసం మూవీని రీ రిలీజ్ చేయడం లేదని శోభు యార్లగడ్డ స్పష్టం చేశారు. 'బాహుబలి రిలీజై పదేళ్లు పూర్తైన సందర్భంగా 'బాహుబలి: ది ఎపిక్' మూమెంట్‌ను సెలబ్రేట్ చేసే దానిపైనే మా ఫోకస్ అంతా ఉంది. ఫ్యాన్స్, మూవీ లవర్స్‌కు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. సినిమా మేజిక్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం.' అంటూ చెప్పారు.
Also Read: ఫీల్డ్‌లోకి 'ఛాంపియన్' ఎంట్రీ - రోషన్ న్యూ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
రన్ టైం ఎంత?
'బాహుబలి: ది ఎపిక్' రన్ టైం ఎంత అనే దానిపై ఇప్పటివరకూ సస్పెన్స్ వీడలేదు. సోషల్ మీడియాలో రన్ టైంపై ఎన్నో రూమర్స్ వచ్చినా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో రానా స్పందించారు. అది రాజమౌళికి మాత్రమే తెలుసని రెండు పార్టుల్లో ఏ సీన్స్ ఉంచుతారో ఏ సీన్స్ కట్ చేస్తారో అనేది తనకు కూడా తెలియదన్నారు. ప్రభాస్ - తమన్నా మధ్య కొన్ని సీన్స్‌తో పాటు 'కన్నా నిదురించరా' పాటను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు రాజమౌళి ఓ సందర్భంలో చెప్పారు. ఈ మూవీ ఓ థ్రిల్లింగ్ ఐపీఎల్ మ్యాచ్‌లా ఉంటుందంటూ మేకర్స్ వెల్లడించారు.
ఇక ప్రమోషన్స్ కూడా అంతే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత మూవీ టీం అంతా కలిసి ఓ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. 2015లో 'బాహుబలి: ది బిగినింగ్' రిలీజ్ కాగా 2017లో 'బాహుబలి: ది కంక్లూజన్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.





















