మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu). ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్. మరి విలన్ ఎవరో తెలుసా? మలయాళం నుంచి ఒక హీరోని రంగంలోకి దింపారు ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi).

వరప్రసాద్ గారికి విలన్‌గా మలయాళీ!Shine Tom Chacko joins Mana Shankara Vara Prasad Garu: మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గుర్తు ఉన్నారా? న్యాచురల్ స్టార్ నాని 'దసరా'తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందులో విలన్ రోల్ చేశారు. ఆ తర్వాత నాగశౌర్య 'రంగబలి', మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర', గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకూ మహారాజ్', నితిన్ 'రాబిన్ హుడ్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం ఆయనకు వచ్చింది.

Also Readనయా 'లేడీ సూపర్ స్టార్'... నయనతార కాదు, ఈవిడ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో విలన్ రోల్ చేసే అవకాశం షైన్ టామ్ చాకో దగ్గరకు వెళ్ళింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆల్రెడీ ఆయన షూటింగులో జాయిన్ అయ్యారట. మూవీ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ సిటీలో జరుగుతోంది. అందులో ఆయన జాయిన్ అయ్యారు. అదీ సంగతి!

ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి!సంక్రాంతి 2026 పండక్కి 'మన శంకర వరప్రసాద్ గారు' విడుదల కానుంది. అయితే ఇప్పటి నుంచి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా 'మీసాల పిల్లా' సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్‌ విడుదల చేశారు. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై సాహు గారపాటి, మెగా డాటర్ సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడు.

Also Read'కాంతార'ను బీట్ చేసిన 'ఇడ్లీ కొట్టు'... అక్కడ ధనుష్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు!