Sharwanand Sreenu Vaitla Titled As George Krish Shooting Started : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారారు. ఆయన కొత్త మూవీ పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ రాబోతోంది.

Continues below advertisement

క్రేజీ టైటిల్ 

శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ మూవీకి 'జార్జ్ క్రిష్' (George Krish) అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టగా... ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తుండగా... త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Continues below advertisement

Also Read : The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

అప్పట్లో ఢీ, వెంకీ, దుబాయ్ శీను మూవీస్‌తో వరుస హిట్స్ సాధించారు శ్రీను వైట్ల. ఆ తర్వాత మూవీస్ తీసినా వర్కౌట్ కాలేదు. రెండేళ్ల క్రితం గోపీచంద్‌తో విశ్వం మూవీ తీశారు. అది కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత శర్వానంద్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయబోతున్నారు. మరి ఇది ఎలా ఉండబోతుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

ఇక, శర్వా విషయానికొస్తే... ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారి మూవీతో హిట్ కొట్టారు. ప్రస్తుతం భోగి మూవీ చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉత్తర తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన పీరియాడికల్ స్టోరీగా పాన్ ఇండియా స్థాయిలో 'భోగి' రిలీజ్ కానుంది. మూవీలో శర్వా జోడీగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'కందుల సులోచన రాణి' అనుపమ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుండగా... మందారం అనే బోల్డ్ రోల్‌లో డింపుల్ నటిస్తున్నారు. 

Also Read : Vishwanath And Sons Review - విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ: సూర్య సినిమా హిట్టా? ఫట్టా? వెంకీ అట్లూరి ఎలా తీశారంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.