Biker OTT : శర్వానంద్ 'బైకర్' ఓటీటీ డీల్ ఫిక్స్ - భారీ ధరకు డిజిటల్ రైట్స్
Biker OTT Platform : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ యూత్ స్పోర్ట్స్ డ్రామా 'బైకర్' ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ అయ్యింది. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సేల్ అయినట్లు తెలుస్తోంది.

Sharwanand's Biker Movie OTT Platform Locked : టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ లేటెస్ట్ యూత్ స్పోర్ట్ డ్రామా 'బైకర్'. ఈ మూవీలో శర్వా లుక్ వేరే లెవల్‌లో ఉంది. ఇదివరకు ఎప్పుడూ చూడని ఓ డిఫరెంట్ స్టైలిష్ లుక్‌లో శర్వా కనిపించారు. రీసెంట్‌గా వచ్చిన మూవీ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
'బైకర్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. భారీ ధరకు ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. డిసెంబర్ 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... థియేట్రికల్ రన్ తర్వాత 4 నుంచి 6 వారాల మధ్యలో మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీకి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా... శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించారు. సీనియర్ హీరో రాజశేఖర్ శర్వా తండ్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తుండగా... గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బైకర్‌గా స్టైలిష్ లుక్‌లో శర్వానంద్ అదరగొట్టారు. బైక్ రేసింగ్ విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇతర రేసింగ్ మూవీస్ కంటే కొత్త కాన్సెప్ట్‌తో 'బైకర్' ఉంటుందని మేకర్స్ తెలిపారు.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ది రాజా సాబ్' రిలీజ్ రూమర్లకు చెక్... ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
స్టోరీ అదేనా?
2000 బ్యాక్ డ్రాప్‌లో బైక్ రేసింగ్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కినట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. 'ఇక్కడ ప్రతీ బైకర్‌కు ఓ కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకు ఎదురెళ్లే కథ. ఏం జరిగినా పట్టు వదలని మొండోళ్ల కథ.' 'గెలవడం గొప్ప కాదు చివరి వరకూ పోరాడడ గొప్ప' డైలాగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఓ యువకుడు రేసింగ్‌లో తన ఆశయాన్ని ఎలా సాధించుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిణామాలేంటి? తన లక్ష్యం సాధించేందుకు ఆ యువకుడు చావుకు కూడా సిద్ధపడ్డాడా? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.





















