Actress Shakeela Warning About Mobile Excessive Use : స్మార్ట్ ఫోన్ అధికంగా యూజ్ చేస్తే ఎలాంటి అనర్థాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా, ప్రముఖ నటి షకీలా... మొబైల్ వల్ల తనకు ఎదురైన భయంకరమైన సమస్య గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను సర్జరీ చేయించుకున్నానని... ఇందుకు రూ.3 లక్షలు ఖర్చైందని తెలిపారు.
స్ట్రాంగ్ వార్నింగ్
మొబైల్ అతిగా వాడడం వల్ల తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధ పడినట్లు తెలిపారు షకీలా. 'దీని వల్ల రూ.3 లక్షలతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఫోన్‌లో చాలాసేపు గేమ్స్ ఆడడం, యూట్యూబ్, ఇన్ స్టా రీల్స్ చూడడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది. నిద్రపోయే టైంలో కూడా ఓ పక్కకు వాలి గంటల సేపు మొబైల్ చూడడంతో మెడలో నరాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫోన్ చాలా ముఖ్యం. కానీ అవసరానికి మించి దాన్ని వాడకండి. ఉపయోగం లేని వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేయకండి. సరిగ్గా వాడకపోతే డబ్బులు పోవడమే కాకుండా, భరించలేని నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. చిన్న పిల్లలకు ఫోన్ ఇవ్వడంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ వాడకాన్ని తగ్గించాలి.' అని తెలిపారు.
18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు షకీలా. తమిళ మూవీ 'ప్లే గర్ల్స్' ఆమెకు ఫస్ట్ మూవీ. 2000 సంవత్సరంలో వచ్చిన మలయాళ మూవీ 'కిన్నార తుంబికల్' ఆమె కెరీర్‌నే మలుపు తిప్పింది. తమిళం, మలయాళం మూవీస్ డబ్బింగ్ అయినా తెలుగులో 'జయం' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నిజం, బంగారం, తొట్టిగ్యాంగ్, శ్రీరామచంద్రులు వంటి సినిమాల్లో నటించారు.
Also Read : Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
