టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్నారు. ఆయన చేసే ప్రతి సినిమా విమర్శకులతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. నందమూరి అభిమానులను మాత్రమే కాకుండా అందరినీ దృష్టిలో పెట్టుకుని... సినిమా సినిమాకు మధ్య వైవిధ్యం చూపించడంతో పాటు కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్ చేస్తున్నారు బాలకృష్ణ. హీరోగా మంచి జోరు మీద ఉన్న ఆయన దగ్గరకు ఒక అతిథి పాత్ర చేయమని రిక్వెస్ట్ వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ 'జైలర్' సీక్వెల్ 'జైలర్ 2' (Jailer 2 Movie)లో ఒక రోల్ చేయమని అడిగారు. అయితే ఇప్పుడు అది షారుఖ్ ఖాన్ వద్దకు వెళ్లిందని సమాచారం.
జైలర్ 2 వద్దనుకున్న బాలకృష్ణ!Balakrishna Rejects Jailer 2?: తెలుగు హీరోలకు తనకు ఇష్టమైన కథానాయకుడు బాలకృష్ణ అని 'జైలర్' దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి బాలయ్య చేత 'జైలర్'లో ఒక రోల్ చేయించాలని అనుకున్నట్లు తెలిపారు.
Also Read: Varun Tej - Niharika: చిరంజీవి - సుష్మిత రూటులో వరుణ్ తేజ్ - నిహారిక!?
'జైలర్' సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ అగ్ర కథానాయకుడు శివ రాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ అతిథి పాత్రల్లో నటించారు. సినిమాలో వాళ్ల పాత్రలకు ఇచ్చిన ఎలివేషన్స్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా నచ్చాయి. 'జైలర్ 2'లో కూడా వాటిని కంటిన్యూ చేయడంతో పాటు అటువంటి క్యారెక్టర్ మరొకటి క్రియేట్ చేశారు నెల్సన్. ఈసారి ఆయన బాలకృష్ణ దగ్గరకు వచ్చారని, ఆయన ఓకే చెప్పారని గతంలో లీక్స్ వచ్చాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... బాలకృష్ణ ఆ అతిథి పాత్రను తనకు వద్దనుకున్నారట. ఇప్పుడు అది షారుఖ్ ఖాన్ దగ్గరకు వెళ్లిందని సమాచారం.
Also Read: ఇవాళ కోట్లకు అధిపతి... కానీ 33 ఏళ్ళు స్లమ్‌లో - డబ్బుల కోసం వేరుశనగలు అమ్మిన బాలీవుడ్ స్టార్
'జైలర్ 2'లో షారుఖ్ కన్ఫర్మ్!Shah Rukh Khan In Jailer 2: రజనీకాంత్ అంటే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (SRK)కు అభిమానం. ఆ విషయాన్ని గతంలో పలుసార్లు చెప్పారు. తన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో రజనీకాంత్ రిఫరెన్సులు చూపించారు. అందువల్ల 'జైలర్ 2' అనేసరికి వెంటనే ఓకే చెప్పారట. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఎవరు అనౌన్స్ చేయలేరు. సినిమా విడుదల అయ్యేవరకు సస్పెన్స్ లో ఉంచుతారేమో.
Also Read: Urfi Javed: ఇస్లాం నుంచి నన్ను బహిష్కరించడానికి వాళ్ళెవరు? ఉర్ఫీ జావేద్ రియాక్షన్ విన్నారా?
