King Movie Glimpse : సరికొత్తగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ - 'కింగ్' మూవీతో మరో వెయ్యి కోట్లు కన్ఫర్మేనా!
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అవెయిటెడ్ మూవీ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. ఆయన కొత్త మూవీకి 'కింగ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.

Shah Rukh Khan's King Movie Glimpse Out : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ బర్త్ డే సర్ప్రైజ్ వచ్చేసింది. 'డంకీ', 'డాన్ 3' మూవీస్ తర్వాత ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
సరికొత్తగా 'కింగ్' షారుఖ్
ఈ మూవీకి అందరూ ఊహించినట్లుగానే మాస్, యాక్షన్ తగ్గట్లుగా 'కింగ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీంతో పాటే రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా అదిరిపోయింది. సముద్రం మధ్యలో ఉండే ఓ జైలులో షారుఖ్ ఫైట్స్, యాక్షన్ స్టంట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఆయన లుక్ కూడా వేరే లెవల్‌లో సరికొత్తగా ఉంది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ యునిక్‌గా, ఓ స్టైలిష్ లుక్‌లో షారుఖ్‌ను ప్రెజెంట్ చేశారని... ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లుక్‌తో పాటే టైటిల్ గ్లింప్స్ వైరల్ అవుతోంది.
మరో రూ.1000 కోట్లు కన్ఫర్మ్!
ఈ మూవీకి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా... ఇదివరకూ వీరిద్దరి కాంబోలో వచ్చిన 'పఠాన్' బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది. 2023లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక 'కింగ్' మూవీలోనూ డిఫరెంట్ లుక్స్, మాస్ యాక్షన్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తుండగా మరోసారి ఆ రికార్డులు కొల్లగొట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, 'కింగ్' మూవీలో షారుఖ్ మొత్తం ఇదే లుక్‌లో ఉంటాడా? లేక జవాన్ తరహాలో డ్యూయెల్ షేడ్స్ ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, షారుఖ్ నటించిన జవాన్ సైతం రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Sau deshon mein badnaam,
— Shah Rukh Khan (@iamsrk) November 2, 2025
Duniya ne diya sirf ek hi naam - #KING#KingTitleReveal
It’s Showtime!
In Cinemas 2026. pic.twitter.com/l3FLrUH1S0
Also Read : నవంబర్ 'SSMB29' బిగ్ అప్డేట్ - ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్... ఏ ఓటీటీలో చూడొచ్చంటే?





















