Shah Rukh Khan Dunki: 'బాద్‌షా' ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. షారుక్ ఖాన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ డంకీ సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రచారం, అనౌన్స్‌మెంట్‌ లేకుండానే ఈమూవీ ఓటీటీలో రిలీజైంది. కాగా వాలంటైన్స్‌ డే సందర్భంగా షారుక్‌ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఉండోబోతుందని రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌ ఓ ప్రకటన ఇచ్చింది. దీంతో అంతా డంకీ రిలీజ్‌ డేట్‌పై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఏకంగా సినిమానే రిలీజ్‌ చేసి షాకిచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. దీంతో డంకీ మూవీ విడుదలైన కొన్ని గంట్లోనే నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌ మూవీస్‌ లిస్ట్‌లోకి వచ్చేసింది. 


'డంకీ' డిజిటల్‌ రైట్స్‌


గతేడాది షారుక్‌ నటించిన ప‌ఠాన్‌, జ‌వాన్ సినిమాలు కాసుల వ‌ర్షం కురిపించడం.. ఈ రెండు సినిమాలు వెయ్యి కోట్లకుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డంతో 'డంకీ' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జ‌రిగింది. ఇక రిలీజ్‌కు ముందే ఈ మూవీ ఓటీటీ హ‌క్కులు రూ. 155 కోట్ల‌కు పలికినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. దీంతో ఈమధ్య కాలంలో బాలీవుడ్‌లో అత్య‌ధిక ధ‌ర‌కు ఓటీటీ రైట్స్ దక్కించుకున్న మూవీగా 'డంకీ' రికార్డ్ క్రియేట్ చేసింది. షారుఖ్ కెరీర్‌లో కూడా హ‌య్యెస్ట్ రేట్‌కు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన సినిమాగా డంకీ నిలిచింది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను టీ సిరీస్ రూ.36 కోట్ల‌కు కొనుగోలు చేసినట్టు సమాచారం.



కలెక్షన్స్‌లో సర్‌ప్రైజ్‌ చేసిన 'డంకీ'


షారుక్‌ పఠాన్‌, జవాన్‌ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ కావడంతో డంకీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుఖ్‌ఖాన్‌, రాజ్‌కుమార్ హిరాణీ కాంబోపై ఉన్న క్రేజ్ కార‌ణంగా రిలీజ్‌కు ముందు  ఫ్యాన్స్‌లో  భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. కానీ రొటీన్ స్టోరీలైన్ కార‌ణంగా ఈ సినిమా యావ‌రేజ్‌గా నిలిచింది. ఈ మూవీ కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అనుకున్నారు. కానీ, 'డంకీ' మిక్స్‌డ్‌ టాక్‌ సొంతమైంది. ఫస్ట్‌ డే కేవలం రూ. 29 కోట్లు రాబట్టిన ఈ మూవీ థియేట్రిక‌ల్ ర‌న్‌లో కలెక్షన్స్‌తో సర్‌ప్రైజ్‌ చేసింది. రివ్యూస్‌కి భిన్నంగా ఈ మూవీ భారీ వసూళ్లు చేసింది. మొత్తంగా డంకీ రూ. 470 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. గ‌త ఏడాది బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. సలార్‌కు పోటీకి దిగిన ఈ మూవీ యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్న రన్‌ టైంలో మాత్రం ఊహించని స్థాయిలో కలెక్షన్స్‌ చేసింది. 


కథ


అక్ర‌మ‌ మార్గాల ద్వారా విదేశాల‌కు వ‌ల‌స వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించే వారి కథల నేపథ్యంలో డంకీ మూవీని తెరకెక్కించాడు రాజ్ కుమార్ హిరాణీ. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలన  ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించాడు. హ‌ర్డీ సింగ్ (షారుఖ్‌ఖాన్‌), మ‌న్నుతో (తాప్సీ) పాటు ముగ్గురు స్నేహితులు త‌మ స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌డానికి ఇంగ్లాండ్ వెళ్లాల‌ని అనుకుంటారు కానీ వారంద‌రూ వీసా టెస్ట్‌లో ఫెయిల‌వుతారు. అడ్డ‌దారుల్లో ఇంగ్లాండ్‌కు వెళ్లాల‌ని నిశ్చ‌యించుకుంటారు. ఈ ప్ర‌యాణంలో వారికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? మ‌న్నును ప్రేమించిన హ‌ర్డీ సింగ్ త‌న ప్రేమ‌ను ఆమెకు వ్య‌క్తం చేశాడా? ప్రియురాలిని క‌ల‌వాల‌ని క‌ల‌లు క‌న్న‌ సుఖీ జీవితం ఎలా విషాదంగా ముగిసింది అన్న‌దే డంకీ మూవీ క‌థ‌.