Laya: పవర్ ఫుల్ బ్రదర్... స్ట్రాంగ్ వుమెన్... కొత్త తరహా సెంటిమెంట్ - 'తమ్ముడు' మూవీపై లయ ఏమన్నారంటే?
Thammudu Movie: నితిన్ 'తమ్ముడు'తో రీ ఎంట్రీ ఇచ్చారు సీనియర్ హీరోయిన్ లయ. జులై 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

Laya About Her Role In Nithiin's Thammudu Movie: చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సీనియర్ హీరోయిన్ లయ 'తమ్ముడు' మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్ హీరోగా 'వకీల్ సాబ్' ఫేం వేణు శ్రీరామ్ ఈ మూవీని తెరకెక్కించగా.. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించారు. జులై 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ రూపొందించగా... నితిన్ అక్కగా లయ నటించారు. ఈ నేపథ్యంలో తన రోల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు లయ.
రీ ఎంట్రీకి సరైన మూవీ
తన రీ ఎంట్రీకి 'తమ్ముడు' మూవీ సరైనదని లయ అన్నారు. 'ఈ సినిమాలో ఝాన్సీ కిరణ్మయి అనే క్యారెక్టర్‌లో నటించాను. కుటుంబాన్ని చూసుకుంటూనే స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా నా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాను. హీరో నితిన్‌కు సోదరి రోల్ నాది. క్యారెక్టర్ కోసం కొంచెం లావు కావాలని చెప్పారు. స్వీట్స్ తిని బరువు పెరిగాను. ఈ మూవీ షూటింగ్ ఫారెస్ట్‌లో జరిగింది. చాలా కష్టపడాల్సి వచ్చింది. మూవీ బాగా వస్తుందనే సంతోషంలో టీం అంతా యూనిటీగా పని చేశాం. ఈ సినిమా షూటింగ్ కాదని ఎవరూ ఎక్కడికీ వెళ్లలేదు. చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేశాం.' అని చెప్పారు.
పవన్ 'తమ్ముడు'తో కంపేరిజన్ లేదు
హీరో నితిన్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించిందని.. స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడిలా అందరితో కలిసిపోయారని లయ చెప్పారు. 'మూవీలో చాలా కష్టమైన సీన్స్ కూడా ఈజీగా చేశారు. 'తమ్ముడు' టైటిల్ ఈ సినిమాకు యాప్ట్. పవన్ కల్యాణ్ గారి మూవీకి ఈ చిత్రానికి పోలిక లేదు. ఈ సినిమా కోసం ఇండియా రావాలనుకున్నప్పుడే అక్కడ యూఎస్‌లో జాబ్ మానేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు. అందుకే ఇండస్ట్రీలో వచ్చిన అవకాశం వదులుకోకూడదని వచ్చేశా. ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్ ఎక్కువగా మాట్లాడదు. కానీ మాట్లాడినప్పుడు చాలా పవర్ ఫుల్‌గా చెబుతుంది. స్ట్రిక్ట్ నెస్‌తో పాటు ఎమోషన్, అఫెక్షన్ కూడా ఉంటాయి.' అని అన్నారు.
Also Read: అసలు ఎవరీ ముకేష్ కుమార్ సింగ్ - బాలీవుడ్ To టాలీవుడ్.. 'కన్నప్ప' డైరెక్టర్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
రోల్ గుర్తుండిపోవాలి
తన కెరీర్‌లో ఇప్పటివరకూ ఓ సాధారణ అమ్మాయి పాత్రల్లోనే నటించానని... 'తమ్ముడు'లో మాత్రం స్ట్రాంగ్ వుమెన్‌గా నటించే ఛాన్స్ దక్కిందని లయ చెప్పారు. 'సినిమాలో ప్రతీ రోల్‌కు ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కథలో ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించాలని అనుకుంటున్నా. ఆ పాత్ర సిస్టర్ అయినా, మదర్ అయినా చేస్తాను. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఆడియెన్స్‌కు నా క్యారెక్టర్ గుర్తుండాలి.
నేను హీరోయిన్‌గా చేసిన చిత్రాల్లోనూ మదర్‌గా కనిపించినవి ఉన్నాయి. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. కథకు డ్రైవింగ్ ఫోర్స్ లాంటి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా నటిస్తా. నేను యూఎస్ ఆర్టిస్టును కాదు హైదరాబాద్ లోకల్ ఆర్టిస్టునే. మూవీస్ ఉన్నప్పుడు ఇక్కడే ఉంటా. ప్రస్తుతం శివాజీ గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఇంకే ప్రాజెక్ట్స్ అంగీకరించలేదు.' అని లయ చెప్పారు.





















