Senior Actor Rajashekar : సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకొని వరుస విజయాలు అందుకున్న ఈయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన ఆయన నితిన్ లేటెస్ట్ మూవీ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' లో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెడుతూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించబోతున్నారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


కాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డిసెంబర్ 4న చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి మూవీ టీమ్ అంతా హాజరయ్యారు. ఇందులో భాగంగా ఈవెంట్లో పాల్గొన్న సీనియర్ హీరో రాజశేఖర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే కదా. ముఖ్యంగా ట్రైలర్ చివరలో రాజశేఖర్ చెప్పిన 'నాకు జీవితం, జీవిత రెండు ఒకటే' అనే డైలాగ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. నిజ జీవితంలో కూడా రాజశేఖర్ అలాగే ఉంటారని చాలామంది అనుకుంటారు.


ఇదే విషయంపై రాజశేఖర్ స్పందిస్తూ.. "సినిమాలో నాకు జీవిత, జీవితం రెండు ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు రాశారు. ఆయనకు ఆ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు. కానీ అది బాగా వైరల్ అయింది. జీవిత ఏం చెప్తే అది నేను చేస్తాను అనే ఉద్దేశంతో వంశీ ఈ డైలాగ్ రాసినట్టున్నాడు. కానీ నిజానికి నేను చెప్పిందే జీవిత వింటుంది. తను చాలా మంచిది. తిరిగి ఒక్క మాట కూడా అనదు. బయట మాత్రం జీవిత చెప్తేనే నేను వింటాను అని అనుకుంటున్నారు. నిజానికి జీవిత చెప్పింది కూడా నేను వింటాను. ఎందుకంటే ఆమె ఏం చెప్పినా నా మంచి కోసమే కదా" అంటూ తన భార్య జీవిత గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు రాజశేఖర్.


ఇక ఇదే ఈవెంట్ లో నితిన్ గురించి మాట్లాడుతూ.. "నితిన్‌ను బయట చూసి ఆకతాయి కుర్రవాడు అనుకున్నా. సినిమాల్లో ఎక్కువగా ఆ పాత్రలే వేశాడు కదా? అలానే ఉంటాడని అనుకున్నా. కానీ సెట్స్‌లో హీరోగా, నిర్మాతగా అన్నీ ఎంతో బాధ్యతతో చూసుకున్నాడు అని చెప్పారు. కాగా ఎక్స్ ట్రా ఆర్డినరీ మూవీని ఆదిత్య మూవీస్ తో కలిసి శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రుచిరా ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తున్నారు. రావు రమేష్, రోహిణి, శ్రీకాంత్ అయ్యంగర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, సోనియా సింగ్ ఇతర పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.


Also Read : 'బలగం' వేణుతో సినిమా? ఈ వార్తల్లో నిజమెంత?