Senior Actor Raghunatha Reddy Passed Away : టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు రఘనాథరెడ్డి శనివారం రాత్రి కన్నుమూశారు. కుషాయిగూడ పరిధిలోని ప్రథమ పురి కాలనీలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. నెల రోజుల క్రితం కన్న కొడుకు గుండెపోటుతో మృతి చెందగా తీవ్ర వేదన చెందారు.

Continues below advertisement

కుమారున్ని కోల్పోయిన బాధ, ఒత్తిడితోనే రఘునాథ రెడ్డి గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ఆయనకి ఇద్దరు కూతుళ్లు. సినీ ఆర్టిస్ట్ శివ పార్వతి ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఇంత పెద్ద ఆర్టిస్టును తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్టించుకోకుండా ఉండడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : ఇవాళ కోట్లకు అధిపతి... కానీ 33 ఏళ్ళు స్లమ్‌లో - డబ్బుల కోసం వేరుశనగలు అమ్మిన బాలీవుడ్ స్టార్

Continues below advertisement

తెలుగులో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించారు. కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఒరేయ్ రిక్షా, చీమల దండు, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, సీమ సింహం, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామ రాజ్యం ఇలా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. శోభన్ బాబు నటించిన 'సర్పయాగం' చిత్రంతో ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టారు. చివరిగా 2018లో 'సుబ్రహ్మణ్య పురం' సినిమాలో నటించిన రఘునాథరెడ్డి అనారోగ్యం కారణంగా సినిమాలకు గుడ్ బై చెప్పారు.