Seetha Payanam Trailer : హీరోయిన్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె - ఎమోషనల్‌గా 'సీతా పయనం' ట్రైలర్
Seetha Payanam Trailer Review : యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న మూవీ 'సీతా పయనం'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Arjun's Seetha Payanam Trailer Telugu Review : మల్టీ టాలెంటెడ్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న లవ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సీతా పయనం'. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ ఆకట్టుకోగా... తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఎమోషనల్‌గా హైప్ క్రియేట్ చేస్తోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
'ఒకతను లిఫ్ట్ అడిగితే ఓకే అన్నాను. ఇప్పుడు అతను నా పక్కనే కూర్చున్నాడు' అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఓపెన్ కాగా... బ్యూటిఫుల్ నేచర్, అలా కారులో హీరో హీరోయిన్ల జర్నీతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. కారులో వీరిద్దరి ప్రయాణం, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే క్రమంలో ఏర్పడ్డ పరిచయం... హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది.
ఇక యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ మాస్ ఎంట్రీ అదిరిపోయింది. యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా ఫైట్స్ మరింత అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ మూవీకి ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ కానున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
Also Read : విశ్వక్ సేన్ 'ఫంకీ' ట్రైలర్ వచ్చేసింది - థియేటర్లలో నవ్వుల తుపాన్ కన్ఫర్మ్
వాలెంటైన్స్ డే సందర్భంగా...
ఈ మూవీతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. నిరంజన్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఆయనకు కూడా ఇదే ఫస్ట్ మూవీ. వీరితో పాటే సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ తదితరులు కీలకపాత్రలు పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహిస్తూనే ఓ స్పెషల్ రోల్ కూడా చేశారు. ఆయన మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు.
ఈ మూవీని వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న రిలీజ్ చేయబోతున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి జి.బాల మురుగన్ సినిమాటోగ్రఫీ అందించగా... సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించనున్నారు.
నటీనటులు : నిరంజన్, ఐశ్వర్య అర్జున్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, యాక్షన్ కింగ్ అర్జున్, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా తదితరులు.
సాంకేతిక బృందం : బ్యానర్: శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, స్టోరీ - స్క్రీన్ ప్లే - ప్రొడ్యూసర్, డైరెక్టర్: యాక్షన్ కింగ్ అర్జున్, డైలాగ్స్ : Dr. సాయి మాధవ్ బుర్రా, మ్యూజిక్: మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: G. బాల మురుగన్, ఎడిటర్: అయూబ్ ఖాన్, ఆర్ట్ డైరెక్టర్స్ : మోహన్ బి కేరీ, శివ కామేష్ డి, CH కృష్ణ, ఫైట్స్ : కిక్ యాస్ కాళీ, లైన్ ప్రొడ్యూసర్ : UL. మూర్తి.
























