Seetha Payanam Box Office Collection: తెలుగులో డ్రాప్... మలయాళంలో గ్రోత్... మూడు రోజుల్లో 'సీతా పయనం'కు కోటి కూడా రాలేదా?
Seetha Payanam Box Office Collection Day 3: అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య నటించిన సినిమా 'సీతా పయనం'. ఈ సినిమా మూడు రోజుల నెట్ కలెక్షన్ ఎంతంటే?

Aishwarya Arjun's Seetha Payanam Movie Collections: యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'సీతా పయనం'. ఇండియాలో ఈ మూవీకి మూడు రోజుల నెట్ ఎంత వచ్చింది? అసలు ఈ సినిమా పరిస్థితి ఏంటి? అనేది చూస్తే...
మూడు రోజుల్లో కోటి కూడా రాలేదు!
Seetha Payanam Three Days India Net Collection: ట్రేడ్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం... 'సీతా పయనం' సినిమాకు ఇండియాలో మూడు రోజుల్లో కోటి రూపాయల నెట్ కలెక్షన్ కూడా రాలేదు. కేవలం 88 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమాకు ఏ భాషలో ఎంత కలెక్షన్ వచ్చింది? అనేది చూస్తే...
- తెలుగులో మూడో రోజు... సోమవారం కలెక్షన్ కొంచెం కిందకు పడింది. ఆదివారం తర్వాత సహజంగా అలా జరుగుతుంది. శని, ఆది వారాల్లో రూ. 16, 18 లక్షలు నెట్ కలెక్షన్ చేశాయి. సోమవారం ఈ సినిమా 12 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా రూ. 46 లక్షల నెట్ రాబట్టింది.
- మలయాళంలో ఆశ్చర్యంగా 'సీతా పయనం' కలెక్షన్ పెరింది. మొదటి రెండు రోజులు ఈ సినిమా లక్ష రూపాయల చొప్పున నెట్ కలెక్ట్ చేసింది. అయితే శనివారం మలయాళంలో ఈ సినిమాకు 3 లక్షల నెట్ వచ్చింది.
- కన్నడలోనూ 'సీతా పయనం' నెట్ కలెక్షన్ డ్రాప్ అయ్యింది. శని, ఆది వారాల్లో 11, 9 లక్షల నెట్ వసూలు చేసిన సినిమా... సోమవారం 6 లక్షల నెట్ మాత్రమే రాబట్టింది.
- తమిళంలో అయితే ఘోరంగా డ్రాప్ అయ్యింది. మొదటి రెండు రోజులు ఐదేసి లక్షల చొప్పున నెట్ వసూలు చేసిన... సోమవారం కేవలం లక్ష రూపాయల నెట్ రాబట్టింది. దాంతో మూడు రోజుల తమిళ నెట్ కలెక్షన్ రూ. 11 లక్షలకు చేరుకుంది.
- తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ... నాలుగు భాషల్లో మూడు రోజుల 'సీతా పయనం' నెట్ కలెక్షన్ రూ. 88 లక్షలు. వరల్డ్ వైడ్ గ్రాస్ విషయానికి వస్తే... 98 లక్షల దగ్గర ఆగింది.
రోడ్ జర్నీ నేపథ్యంలో ఫ్యామిలీ వేల్యూస్, వెడ్డింగ్ ఇంపార్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వంటి అంశాలతో 'సీతా పయనం' రూపొందించారు. ఇందులో ఐశ్వర్య అర్జున్ జంటగా ఉపేంద్ర అన్న కుమారుడు నిరంజన్ నటించారు. ఈ సినిమాకు అర్జున్ దర్శకత్వం వహించడంతో పాటు సొంతంగా ప్రొడ్యూస్ చేశారు. ఇందులో ప్రకాష్ రాజ్, కోవై సరళ, సత్యరాజ్, బిత్తిరి సత్తి, సిరి హనుమంతు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా విడుదలైంది. సినిమా కలెక్షన్లు మాత్రం షాకింగ్‌గా ఉన్నాయి.























