Aishwarya Arjun Seetha Payanam Collections: అమ్మాయి ఐశ్వర్య అర్జున్ కోసం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మెగాఫోన్ పట్టుకున్నారు. 'సీతా పయనం' తీశారు. ఇది ప్రేమతో, విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రమ్. పాన్ ఇండియా రిలీజ్ చేయగా... ఓపెనింగ్ డే బాక్స్ ఆఫీస్ బరిలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ డే ఈ సినిమా ఇండియాలో ఎంత నెట్ కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...
ఇండియాలో 50 లక్షలు కూడా రాలేదు!Seetha Payanam First Day India Net Collection: ఇండియాలో 'సీతా పయనం' సినిమా ఫస్ట్ డే కేవలం 33 లక్షల రూపాయల నెట్ మాత్రమే వచ్చింది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేశారు. కన్నడతో కంపేర్ చేసినా తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అసలు ఏ భాషలో ఎంత కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...
- కన్నడలో 'సీతా పయనం' నెట్ కలెక్షన్ 11 లక్షల రూపాయలు
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'సీతా పయనం' నెట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రూ. 16 లక్షలు
- తమిళనాడులో 'సీతా పయనం' సినిమాకు కేవలం రూ. 5 లక్షల నెట్ వచ్చింది.
- మలయాళంలో 'సీతా పయనం' కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. అక్కడ నుంచి కేవలం లక్ష నెట్ మాత్రమే వచ్చింది.
- దక్షిణాది భాషల్లో 'సీతా పయనం' ఓపెనింగ్ డే నెట్ కలెక్షన్ 33 లక్షలు. గ్రాస్ లెక్క చూస్తే 36 లక్షలు ఉండొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.
తెలుగులో హీరో హీరోయిన్లకు మొదటి సినిమాఅర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య నటించిన సినిమా 'సీతా పయనం'. ఇందులో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అన్న కుమారుడు నిరంజన్ హీరో. ఆ అబ్బాయికి తెలుగులో మొదటి చిత్రమిది. ఐశ్వర్యకు సైతం ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు చిత్రమిది. ఇందులో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రలు చేశారు. అర్జున్, ఆయన మేనల్లుడు ధృవ్ సర్జా ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
