Saraswathi First Look: వరలక్ష్మి కోసం సమంత... 'సరస్వతి' ఫస్ట్ లుక్ చూశారా?
Varalaxmi Sarathkumar Look In Saraswathi: విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా పరిచయమవుతున్న సినిమా 'సరస్వతి'. సమంత చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.

Samantha launches Saraswathi movie first look: కథానాయికగా, ప్రతినాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా... ఎటువంటి పాత్రలోనైనా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar). విలక్షణ నటిగా పేరు పొందిన ఆవిడ ఇప్పుడు దర్శకురాలిగా మారుతున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ సమంత విడుదల చేశారు.
'సరస్వతి'గా వరలక్ష్మి ఫస్ట్ లుక్ చూశారా?
వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సరస్వతి'. ఆవిడ టైటిల్ రోల్ చేశారు. అంతే కాదు... సోదరి పూజా శరత్ కుమార్ (Pooja SarathKumar)తో కలిసి దోస డైరీస్ సంస్థపై నిర్మిస్తున్నారు. ఇదొక హై కాన్సెప్ట్ థ్రిల్లర్. సమంత ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
తెల్లని క్రాక్ టెక్స్చర్ బ్యాక్‌డ్రాప్ మధ్యలో ఎరుపు చీర కట్టుకుని ధైర్యంగా నిలబడి వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించారు. కథలో బలం, భావోద్వేగాలను హైలైట్ చేసేలా టైటిల్ పోస్టర్ డిజైన్ చేశారు. వరలక్ష్మి వెనుక భాగంలో ప్రకాష్ రాజ్ లుక్ కూడా కనిపించింది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని చిత్ర బృందం తెలిపింది.
View this post on Instagram
Saraswathi Movie Cast: వరలక్ష్మి శరత్ కుమార్ టైటిల్ రోల్ చేస్తున్న 'సరస్వతి' సినిమాలో జీవా, ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక, కిషోర్ కుమార్, శ్రీకాంత్ అయ్యర్, రావు రమేష్, సప్తగిరి, మైమ్ గోపి, హరేష్ పరేడే, తులసి, రఘు బాబు, దేవీ ప్రసాద్, వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి దర్శకత్వం: వరలక్ష్మి శరత్ కుమార్, నిర్మాతలు: పూజా శరత్ కుమార్ & వరలక్ష్మి శరత్ కుమార్, సహ దర్శకుడు: నరేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్ డేనియల్, ఛాయాగ్రహణం: ఎడ్విన్ సకాయ్, సంగీతం: తమన్, కూర్పు: వెంకట్, కళా దర్శకుడు: సుధీర్.























