Sankranthiki Vasthunam Collection Day 4: నాలుగో రోజూ ఆగని వెంకీ మామ జోరు... 'సంక్రాంతికి వస్తున్నాం' ఫోర్ డేస్ కలెక్షన్ ఎంతంటే?
Sankranthiki Vasthunam Box Office Collection Day 4: వెంకటేష్ జోరు బాక్స్ ఆఫీస్ బరిలో కొనసాగుతోంది. నాలుగో రోజు సినిమా భారీ వసూళ్లు సాధించింది. అయిదో రోజైన శనివారం మంచి నంబర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

కథానాయకుడిగా విక్టరీ వెంకటేష్ (Venkatesh) నట ప్రయాణంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా (Sankranthiki Vasthunnam Box Office Collection) ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకం అని చెప్పాలి. ఆయన కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా మాత్రమే కాదు... ఇంకా పలు రికార్డులను ప్రేక్షకుల రివార్డులను వెంకీ మామ ఖాతాలో జమ చేస్తోంది ఈ సినిమా.
వెంకీ మామ సినిమా ఖాతాలో నాలుగో రోజు 25 కోట్లు!
మూడు రోజుల్లోనే 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ బరిలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ పండగ బరిలో వచ్చిన మరొక సినిమా, నట సింహం బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'డాకు మహారాజ్' 100 కోట్ల క్లబ్ లో చేరడానికి నాలుగు రోజులు తీసుకుంటే... ఆ ఘనతను వెంకీ మామ సినిమా మూడు రోజుల్లో అందుకుంది.
సినిమా విడుదలైన నాలుగో రోజు... శుక్రవారం సైతం బాక్స్ ఆఫీస్ బరిలో 'సంక్రాంతికి వస్తున్నాం' సందడి కనిపించింది. ఆ రోజు ఈ సినిమా పాతిక కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో నాలుగు రోజుల వసూళ్లు 136 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. శనివారం వసూళ్లతో ఈ సినిమా 150 కోట్ల రూపాయల క్లబ్బులో చేరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: టీవీ ఇండస్ట్రీలో ఘోర విషాదం... ట్రక్కు ఢీ కొట్టడంతో 22 ఏళ్ల నటుడు మృతి
Audiences across the globe are celebrating their favourite film of this festive season ❤️
— Sri Venkateswara Creations (@SVC_official) January 18, 2025
A HUMUNGOUS 131+ Crores Gross Worldwide in 4 Days for #BlockbusterSankranthikiVasthunam 🔥🔥
— https://t.co/ocLq3HYNtH#SankranthikiVasthunam IN CINEMAS NOW 🫶
Victory @venkymama… pic.twitter.com/0PY7FoRpWm
వెంకటేష్ కలెక్షన్స్ రికార్డులు తిరగరాస్తున్న సినిమా
ఇప్పటి వరకు హీరో వెంకటేష్ ఖాతాలో 200 కోట్ల రూపాయల గ్రాస్ అందుకున్న సినిమా లేదు. ఆ లోటు సంక్రాంతికి వస్తున్నాం భర్తీ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం అవసరం లేదు. వెంకటేష్ మార్క్ వినోదానికి అనిల్ రావిపూడి రచన తోడు కావడంతో థియేటర్లలో నవ్వులు పండగ నెలకొంది. వెంకటేష్ నటన అనిల్ రావిపూడి రాసిన సన్నివేశాలను చూసి ప్రేక్షకులు పగలబడి నవ్వుతున్నారు. హాయిగా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. తన రచన మీద వచ్చిన విమర్శలకు అనిల్ రావిపూడి అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ విజిల్స్ వేసేది తనకు తెలిసిన సినిమా అని ఆయన స్పష్టం చేశారు.
లక్కీ భాస్కర్ సినిమాతో 'లక్కీ హీరోయిన్' అనిపించుకున్న మీనాక్షి చౌదరికి ఆ తర్వాత వచ్చిన మట్కా డిజాస్టర్ ఇచ్చింది. ఇక విశ్వక్ సేన్ జంటగా నటించిన మెకానిక్ రాకీ కూడా ఆశించిన విజయం అందుకోలేదు. ఆ రెండు పరాజయాల తర్వాత మీనాక్షి చౌదరికి సంక్రాంతికి వస్తున్న మరో విజయం అందించింది తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.
Also Read: తండ్రి వర్ధంతికి బాలకృష్ణ ఘన నివాళి... భారతరత్న సాధించి తీరతామన్న ఆర్ఆర్ఆర్





















