బాలీవుడ్ నటుడు, 'ఖల్ నాయక్' సంజయ్ దత్ (Sanjay Dutt) ఓ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. శేఖర్ సుమన్ హోస్ట్ చేస్తున్న 'శేఖర్ టునైట్' షోలో '(భారత) దేశంలో శాంతి లోపించింది' అని దత్ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో సంజయ్ దత్ స్పష్టత ఇచ్చారు.
అదంతా స్క్రిప్ట్‌లో భాగమే... నా వ్యక్తిగత అభిప్రాయం కాదు!గాంధీ జయంతి సందర్భంగా ప్రసారమైన 'శేఖర్ టునైట్' షోలో సంజయ్ దత్ పాల్గొన్నారు. అందులో మన భారత దేశంలో ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ... "భారతీయులు ఎంతో అప్యాయత కలిగిన వ్యక్తులు. ఇక్కడ (అంటే మన దేశంలో) శాంతి ఉండాలి. అయితే... ఆ ప్రశాంతత గానీ, శాంతి గానీ నాకు కనిపించడం లేదు. భారతీయులది విశాల హృదయం. అతిథులను ఆదరించి, గౌరవించడం మన సంస్కృతి. మళ్ళీ ఆ రోజులు త్వరలో తిరిగి రావాలని నేను శివుడిని ప్రార్థిస్తున్నాను'' అన్నారు. ఆ వ్యాఖ్యలు అన్నీ స్క్రిప్ట్‌లో భాగమేనని చెప్పారు.
Also Read: Dharani I Love You - రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
సోషల్ మీడియా విమర్శల వెల్లువ...దాంతో చేతులెత్తి మొక్కిన సంజయ్!భారత దేశంలో శాంతి లేదని సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆయన వీడియో క్లిప్‌లు ట్రెండ్ అయ్యాయి. అంతే కాదు... నెటిజనుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సంజయ్ దత్ వ్యాఖ్యలను కొందరు తప్పు బట్టగా... మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన వివరణ ఇచ్చారు. ఓ వీడియో విడుదల చేశారు.
Also Read: Husharu 2 - ట్రక్కులో బీరుతో కల్ట్ బాయ్స్ ఈజ్ బ్యాక్... డబుల్ ఫన్ అండ్ మ్యాడ్‌నెస్‌తో 'హుషారు 2'
'శేఖర్ టునైట్' షోలో తాను చేసిన వ్యాఖ్యలు స్క్రిప్ట్‌లో భాగమేనని, తన వ్యక్తిగత అభిప్రాయం కాదని సంజయ్ దత్ తేల్చి చెప్పారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో చేతులు జోడించి మొక్కుతూ... ప్రజల స్పందన తనకు అర్థమైందన్నారు. "ఇటీవల శేఖర్ సుమన్ షోలో నా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చాలా మంది నన్ను సంప్రదించారు. స్క్రిప్ట్ ప్రకారమే ఆ షో చేశాం. అందులో నేను చెప్పినవి నా వ్యక్తిగత ఆలోచనలు, అభిప్రాయాలు కావు. నా వ్యక్తిగత అభిప్రాయాలపై ఎటువంటి పొరపాట్లు రాకూడదని ఈ వివరణ ఇస్తున్నా. జై హింద్, జై భారత్" అని సంజయ్ దత్ స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదని ఆయన స్పష్టత ఇచ్చారు. ఆ షోలో కాసేపు 'మున్నా భాయ్' పాత్రలోకి మారిపోయిన సంజయ్ దత్... ఒకవేళ మున్నాభాయ్ దేశ ప్రధాని అయితే ఎలా ఉంటుందో ఊహించుకున్నారు.
